Parliament Winter Session : పార్లమెంట్ లో అగ్నిపథ్ పైనే ఫోకస్
లేవనెత్తనున్న ప్రతిపక్ష పార్టీల నేతలు
Parliament Winter Session : దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తూ వచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీం పై మరోసారి పార్లమెంట్ వేదికగా లేవదీయాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి.
దానినే ప్రధానంగా చర్చకు తీసుకు వచ్చేలా చేయాలని అనుకుంటున్నాయి. ఇదే సమయంలో పార్లమెంట్ (లోక్ సభ , రాజ్యసభ) వర్షకాల సమావేశాలు ప్రారంభం(Parliament Winter Session) కానున్నాయి.
ఇదే సమయంలో కీలకమైన భారత దేశానికి సంబంధించి అత్యున్నతమైన పదవిగా భావించే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతికి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి.
బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము ఉండగా విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 21న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం.
ఇదిలా ఉండగా వర్షాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన ఇమేజ్ ను కాపాడుకునేందుకు బీజింగ్ ను బుజ్జగిస్తున్నారని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ.
బీజేపీయేతర పార్టీలను బీజేపీ సర్కార్ కావాలని కూల దోసేందుకు యత్నిస్తోందంటూ మండిపడింది. ఇప్పటికే ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్ముకుంటూ పోతోందని మండిపడింది.
ఈ సమావేశాలలో భారత్, చైనా సరిహద్ద ప్రతిష్టంభన, సాయుధ దళాలకు స్వల్పకాలిక రిక్రూట్ మెంట్ కోసం తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీం, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, తదితర ప్రధాన అంశాలపై కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ప్రస్తావించనున్నాయి.
Also Read : బీజేపీ వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చూపు