HCL Tech CEO : భవిష్యత్తు వర్చువల్ టెక్నాలజీదే
హెచ్ సీ ఎల్ సిఇఓ విజయ్ కుమార్
HCL Tech CEO : దేశీయ టెక్ దిగ్గజ కంపెనీ హెచ్ సీ ఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సి. విజయ కుమార్(HCL Tech CEO) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టెక్నాలజీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని వెల్లడించారు.
అంతే కాదు సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ , సాఫ్ట్ వేర్ టెస్టింగ్ , డాటా సైన్స్ , టెలికాం మేనేజ్ మెంట్ తో పాటు వర్చువల్ టెక్నాలజీకి అత్యధిక డిమాండ్ ఉంటుందన్నారు.
కాక పోతే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంకుర (స్టార్టప్ ) సంస్థలు పుట్టుకు వస్తున్నాయని పేర్కొన్నారు సిఇఓ. అయితే ఎక్కువగా భవిష్యత్తు మాత్రం వర్చువల్ టెక్నాలజీకే ప్రయారిటీ ఉంటుందన్నారు.
తాజాగా దిగ్గజ కంపెనీ గూగుల్ స్టార్టప్ ల ఫండింగ్ కోసం ఇండియాలో స్టార్టప్ స్కూల్ ను ఏర్పాటు చేసింది. భారత్ లో పెద్ద ఎత్తున అంకురాలు పుట్టుకు వస్తున్నాయి.
గత కొంత కాలంగా కరోనా, తదితర పరిస్థితుల కారణంగా ఇన్వెస్ట్ మెంట్స్ , వెంచర్ క్యాపిటల్ డీల్ వాల్యూమ్ తగ్గిన మాట వాస్తవమేనని సిఇఓ ఒప్పుకున్నారు.
భారత్ పరంగా చూస్తే రాబోయే కొన్నేళ్లలో ఎలాంటి ఢోకా లేదన్నారు. వాల్యూయేషన్ లో కొంత తగ్గుదల ఉందన్నారు. ఇదిలా ఉండగా 10,000 స్టార్టప్ లను లక్ష్యంగా చేసుకునేందుకు గూగుల్ స్టార్టప్ స్కూల్ ఇనిషియేటివ్ ను ప్రకటించింది.
నాస్కాం ప్రకారం ఏప్రిల్ – జూన్ మధ్య కాలంలో స్టార్టప్ లలో నిధులు వరుసగా 17 శాతం మేర తగ్గాయి. భారతీయ స్టార్టప్ లు సేకరించిన మొత్తం నిధులు 33 శాతం తగ్గడం కొంత ఆందోళన కలిగించే అంశం.
Also Read : డిజిటల్ మీడియాపై కేంద్రం నజర్