Mithali Raj : ఆడపిల్లలు ఆడడం ఆనందంగా ఉంది
మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్
Mithali Raj : ఒకప్పుడు పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు వేరు. ఆనాడు ఆడేందుకు తాను చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ ఇవాళ ఎక్కడ చూసినా క్రికెట్ ను ప్రేమిస్తున్నారు. ఆస్వాదిస్తున్నారు. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆపై ఎక్కడ చూసినా ఆడపిల్లలు ఆడేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇది తనను ఎక్కువగా సంతోషానికి గురి చేస్తోందన్నారు తాజాగా క్రికెట్ నుంచి నిష్క్రమించిన దిగ్గజ క్రికెట్ క్రీడాకారిణి హైదరాబాదీ స్టార్ మిథాలీ రాజ్(Mithali Raj).
ఇప్పుడు క్రికెట్ కు ఎనలేని ఆదరణ లభిస్తోంది. భవిష్యత్తులో మరింత ఆదరణ ఉంటుందని అన్నారు. ఎంతో మంది ఆడపిల్లలు చదువుతో పాటు క్రికెట్ , ఇతర ఆటల్లోకి వస్తున్నారు.
తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అవకాశాలు ఒకరు ఎప్పుడూ మనకు ఇవ్వరు. మనకి మనమే సృష్టించు కోవాల్సి ఉంటుందన్నారు.
అందుకు నిరంతర సాధన తప్ప మరో మార్గం లేదన్నారు మిథాలీ రాజ్. ఇవాళ వీధుల్లో ఆడడం సర్వ సాధారణమైన విషయంగా మారిందన్నారు ఆమె.
నేను 1999లో క్రికెట్ లోకి వచ్చినప్పుడు ఇప్పుడున్నంత వసతులు లేవు. కానీ రాను రాను ఫార్మాట్ లు మారాయి. పద్దతులు మారాయి. ఇప్పుడున్నంత ప్రోత్సాహం అప్పుడు లేదన్నారు.
నేను ఒక సాధారణ అమ్మాయిగా అడుగు పెట్టాను. అలాగే ఉండాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు మిథాలీ రాజ్(Mithali Raj). ఎత్తు పల్లాలు సహజమేనని , వాటిని తట్టుకుని నిలబడగలిగే మానసిక స్థైర్యాన్ని అలవర్చు కోవాలని సూచించారు.
ఇందుకు తనకు పుస్తకాలు ఎక్కువగా ఉపయోగ పడ్డాయని చెప్పారు. పురుషులు ఎక్కువగా ఉండే వారు. కానీ నేను ఒక్కదాన్నే. కానీ ఇదే శిబిరంలో ఇప్పుడు 60 నుంచి 80 మంది చేరడం సంతోషంగా ఉందన్నారు మిథాలీ రాజ్.
Also Read : ప్లేయర్ ఆఫ్ మంత్ గా ఏంజెల్..తుబా