Madan Mohan Lokur : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ మోహన్ లోకూర్ (Madan Mohan Lokur) సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో ఎన్నడూ లేని రీతిలో ద్వేష పూరిత ప్రసంగాలు పెరిగాయని పేర్కొన్నారు.
కులం, మతం, వర్గ, విభేదాలు కొత్త రూపంలో చోటు చేసుకోవడం పట్ల జాగ్రత్తంగా ఉండాలని సూచించారు. ధర్మ సంసద్, ముస్లిం మహిళలను వేలం వేసేందుకు రూపొందించిన సుల్లీ డీల్స్ , బుల్లీ బాయ్ యాప్స్ పై కూడా లోకూర్ స్పందించారు.
ఇలాంటి విద్వేష పూరితమైన ప్రసంగాలు చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. వీటిని మొగ్గలోనే తుంచి వేయాలని లేక పోతే తీవ్ర ఘటనలు జరిగేందుకు దోహదం చేస్తాయని హెచ్చరించారు జస్టిస్ లోకూర్.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూక హత్యలకు పాల్పడిన వారికి ఓ మంత్రి ఈ మధ్య బాగానే సత్కారం చేశారంటూ సీరియస్ అయ్యారు.
ఢిల్లీలో కేబినెట్ కాని ఓ మంత్రి గోలీ మారో అంటూ చెప్పి కేబినెట్ మినిష్టర్ అయ్యారంటూ మండిపడ్డారు. దర్మ సంసద్ అంశం దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయ స్థానం వరకు వచ్చే దాకా కూడా చర్యలు తీసుకో లేదన్నారు.
ఆ తర్వాత జోక్యం చేసుకోవడంతో గత్యంతంరం లేని పరిస్థితుల్లో అరెస్ట్ చేశారన్నారు. ఇటీవల మళ్లీ బెయిల్ పై కూడా తిరిగి వచ్చారన్నారు.
విచిత్రం ఏమిటంటే ఏ మానవ సమూహాన్ని ద్వేషిస్తున్నారో వారే ఇవాళ పవర్ లో ఉండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ జస్టిస్ మదన్ మోహన్ లోకూర్(Madan Mohan Lokur).
ఇప్పటికైనా ఆయన చేసిన వ్యాఖ్యలు అర్థం చేసుకుంటే మంచిది లేక పోతే దేశం ప్రమాదంలో ఉన్నట్టే లెక్క.
Also Read : మరోసారి అఖిలపక్షం సమావేశం