NV Ramana : న్యాయ వ్య‌వ‌స్థ అత్యంత కీల‌కం

జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ

NV Ramana : ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో న్యాయ వ్య‌వ‌స్థ అత్యంత కీల‌క‌మైన‌ద‌ని స్ప‌ష్టం చేశారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌. భార‌త దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన సంద‌ర్భంగా ప్ర‌సంగించారు.

గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్క‌డికి దాకా వ‌చ్చానంటే ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాన‌ని చెప్పారు. త‌న అనుభ‌వాల‌ను ఈ సంద‌ర్బంగా పంచుకున్నారు.

త‌న జీవ‌న ప్ర‌యాణంలో అనేక మ‌లుపులు ఉన్నాయ‌ని గుర్తు చేసుకున్నారు. అనేక ఆందోళ‌న‌లు, పోరాటాల్లో భాగ‌స్వామిగా ఉండ‌డం వ‌ల్ల బాధ‌లు అనుభ‌వించాన‌ని చెప్పారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌(NV Ramana).

ఆ అనుభవాలే త‌న‌ను ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న ఆస‌క్తి క‌లిగించేలా చేసింద‌న్నారు. ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నా. స‌క్సెస్ కు షార్ట్ క‌ట్స్ అంటూ ఉండ‌వ‌ని తెలుసుకున్నాన‌ని తెలిపారు ఎన్వీ ర‌మ‌ణ‌.

సామాన్యుల‌కు న్యాయం చేయ‌డ‌మే న్యాయ వ్య‌వ‌స్థ అంతిమ ల‌క్ష్యం కావాల‌న్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు బార్ కృషి చేయాల‌న్నారు.

ప్ర‌జ‌ల్లో అవగాహ‌న‌, విశ్వాసం పెంపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 16 నెల‌ల ప‌ద‌వీ కాలంలో 11 మంది సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు, 15 మంది హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు, 224 మంది హైకోర్టు న్యాయ‌మూర్తుల నియామ‌కం జ‌రిగింద‌ని చెప్పారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.

అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్, సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా, సుప్రీంకోర్టు బార్ అసోసియేష‌న్ చైర్మ‌న్ వికాస్ సింగ్ ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

పెండింగ్ కేసులే అతి పెద్ద స‌వాల్ అని పేర్కొన్నారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌. శాశ్వ‌త ప‌రిష్కారాల‌కు ఆధునిక సాంకేతిక‌ను, కృత్రిమ మేధ‌స్సును వాడుకోవాల‌ని సూచించారు.

Also Read : పెండింగ్ కేసుల ప‌రిష్కారంపై ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!