Ilayaraja : సంగీత దిగ్గజం సమున్నత శిఖరం
సమున్నత వ్యక్తికి రాజ్యసభ గౌరవం
Ilayaraja : భారతదేశపు సినీ సంగీతపు ప్రస్థానంలో అతడొక ఉత్తుంగ తరంగం. మహోజ్వల చరిత్ర కలిగిన ఈ సంగీతకారుడు..రారాజు ఎవరో కాదు ఇళయరాజా.
అసలు పేరు జ్ఞాన దేశికన్. దివంగత పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం అనే వ్యక్తి లేక పోయి ఉంటే ఇవాళ ఈ మ్యూజిక్ మ్యాస్ట్రో మనకు దక్కి ఉండేవాడు కాదు.
రైల్వే స్టేషన్ లో దొరికిన ఇళయారాజాను సినీ రంగానికి పరిచయం చేశాడు ఎస్పీబీ. అది పక్కన పెడితే ఇవాళ మరోసారి దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు మ్యూజిక మ్యాస్ట్రో.
అతడి శిష్యుడే అల్లా రఖా రెహమాన్ . ఆయనకు ఇసై జ్ఞాని, రాసయ్య, రాజా అని ఇతర పేర్లు కూడా ఉన్నాయి. 2 జూన్ 1943లో తమిళనాడులోని మధురై జిల్లా పన్నైపురంలో పుట్టాడు.
దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపోసర్లలో ఇళయారాజా(Ilayaraja) కూడా ఒకరుగా పేరొందారు. సంగీత దర్శకుడిగా, కంపోసర్ గా, రచయితగా, గాయకుడిగా, వాయిద్యకారుడిగా, నిర్మాతగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
పియానో, హార్మోనియం పెట్టె, గిటార్ , కీ బోర్డు, ట్రంపెట్ , సాక్సో ఫోన్ , ఎలక్ట్రిక్ వాయిద్యాలు, గాత్రం ఉన్నాయి. 1976 నుంచి తన కెరీర్ కొనసాగుతూనే ఉంది నేటి దాకా.
తన 30 ఏళ్ల కెరీర్ లో 5 వేలకు పైగా పాటలకు ప్రాణం పోశాడు. 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు ఇళయారాజా. 1970, 1980, 1990 దశాబ్దాల కాలంలో ఇళయరాజా(Ilayaraja) ఒక వెలుగు వెలిగారు.
దక్షిణ భారత దేశాన్ని శాసించారు. భారతీయ సంగీతంలో విశాలమైన , వినసొంపైన జిలుగులను ప్రవేశ పెట్టాడు. 1993లో లండన్ లోని ప్రఖ్యాత రాయల్ పిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో సింఫనీని కంపోజ్ చేసి విస్తు పోయేలా చేశాడు ఇళయరాజా.
ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం. 2003లో బీబీసీ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో దళపతి సినిమా కోసం చేసిన చిలకమ్మా చిటికేయ్యంగా పాట టాప్ 10లో చోటు దక్కింది.
వరల్డ్ వైడ్ గా నిర్వహించిన టాప్ 10 పాటల్లో ఈ సాంగ్ కు 4వ స్థానం దక్కింది. ఇక 2013లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సీఎన్ఎన్ – ఐబీఎన్ నిర్వహించిన 100 ఏళ్ల భారత సినీ పరిశ్రమ పండగ సందర్భంగా నిర్వహించిన సర్వేలో ఇళయరాజాను భారత దేశ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు.
2012లో సంగీత నాటక అకాడెమీ, 2014లో చంద్రశేఖర సరస్వతి నేషనల్ పురస్కారం అందుకున్నారు . 2015లో జీవిత సాఫల్య పురస్కారం తీసుకున్నారు.
2018లో భారత ప్రభుత్వం ఇళయరాజాను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇక తాజాగా మోదీ ప్రభుత్వం 6 జూలై 2022న పెద్దల సభ రాజ్యసభకు నామినేట్ చేసింది ఇళయారాజాను.
Also Read : పయోలీ ఎక్స్ ప్రెస్’ వెరీ వెరీ స్పెషల్