Rajnath Singh : ప్రపంచంలో మరే ఇతర దేశం ఏదైనా ఉందంటే అది భారత దేశం ఒక్కటేనని స్పష్టం చేశారు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. భారత దేశాన్ని జగత్ గురువుగా మార్చడమే తమ కల అని అన్నారు.
దేశాన్ని శక్తివంతంగా , సంపన్నంగా, విజ్ఞాన వంతంగా , విలువలతో కూడిన దేశంగా మార్చాలని అనుకుంటున్నామని చెప్పారు. భారత దేశం శక్తి గొప్పది. ఇది ప్రపంచానికి ఇప్పుడు తెలిసొచ్చందన్నారు రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh ).
కొన్ని తరాల నుంచి ఇండియా అత్యంత శక్తివంతమైన దేశంగా మారిందన్నారు. ప్రపంచంలోని దేశాలన్నీ శాంతియుతంగా ఉండాలని తాము ముందునుంచీ కోరుకున్నామని చెప్పారు. ఎవరినీ భయ పెట్టేందుకు కాదన్నారు.
ప్రపంచంలో ఎవరినీ భయ పెట్టేందుకు కాదన్నారు. ఏ ఇతర దేశంపై కూడా ఒక్క అంగుళం భూమిపై దాడి చేయని లేదా ఆక్రమించని ఏకైక దేశం భారత దేశం అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పురోభివృద్ది చెందుతున్న దేశంగా ముందుకు దూసుక వెళుతోందని పేర్కొన్నారు.
తెలివి తేటలు, విద్యార్హతలు సరి పోవని విలువలను పెంపొందించే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. నీతి, నిజాయితీ, ధర్మ బద్దమైన జీవితం గడిపేలా చూడాలన్నారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh ).
ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఇంజనీరింగ్ లో కొత్త ప్రోగ్రామ్ లను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. కంప్యూటర్ సైన్స్ , ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ లో బీటెక్ , సమీకృత ఐదేళ్ల న్యాయ వాద విద్యను ప్రారంభిస్తామని చెప్పారు రాజ్ నాథ్ సింగ్.
Also Read : భద్రతా మండలి లో భారత్ ఓటింగ్ కు దూరం