Rajendra Singh Rathore : రాజకీయ సంక్షోభం దురదృష్టకరం
ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్
Rajendra Singh Rathore : రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. సీఎం పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ ను మారుస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ప్రభుత్వంలో సచిన్ పైలట్(Sachin Pilot) , గెహ్లాట్ మధ్య నువ్వా నేనా అన్న ఆధిపత్యం కొనసాగుతోంది.
చోటు చేసుకున్న సంక్షోభానికి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది. హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించి పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అజయ్ మాకెన్, మల్లికార్జున్ ఖర్గేను నియమించింది. ఇదే విషయంపై మరో కీలక నేత కేకే వేణుగోపాల్ అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) కు ఫోన్ కూడా చేశారు.
ప్రస్తుతం కుర్చీ కోసం కొట్లాట కొంత కాలం నుంచీ కొనసాగుతూ వస్తోంది. ఇదిలా ఉండగా రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకుడు రాజేంద్ర రాథోడ్ స్పందించారు. సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు సైతం తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఈ నాటకం దారుణం. రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలను ఆందోళనలోకి నెట్టి వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.
కొన్నిసార్లు వారంతా రోజుల తరబడి హోటళ్లలో ఉంటారు. మరికొన్ని సార్లు ప్రభుత్వాన్ని నడిపే నాయకులు వేరే పార్టీలోకి వెళ్లి పోతారంటూ ఎద్దేవా చేశారు. అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదన్నారు రాజేంద్ర రాథోడ్(Rajendra Singh Rathore).
భారత్ జోడో యాత్రను పక్కన పెట్టండి రాహుల్ గాంధీ..ముందు రాజస్తాన్ లో చోటు చేసుకున్న సంక్షోభానికి సొల్యూషన్ చూపండి అంటూ హితవు పలికారు.
Also Read : రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం