Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన ఊపిరి ఉన్నంత దాకా రైతులకు అండగా ఉంటానని, వారికి అన్యాయం జరిగితే సహించ బోనంటూ హెచ్చరించారు. పంటలు నష్ట పోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు.
ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవని పేర్కొన్నారు. ఇది మీ మనందరి ప్రభుత్వం. ఈ సర్కార్ ప్రజలది. ముమ్మాటికీ సామాన్యులది. ఆనాడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడు, విప్లవ వీరుడు భగత్ సింగ్ నాకు ఆదర్శం.
ఆయన కన్న కలలు నిజం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. పంటలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం కింద రైతులకు చెక్కులను పంపిణీ చేశారు భగవంత్ మాన్(Bhagwant Mann ).
రైతులను అడ్డం పెట్టుకుని, వారిని నమ్మించి మోసం చేసిన నాయకులు, వ్యక్తులు, సంస్థలపై తమ ప్రభుత్వం విచారణ చేపడుతుందని సభా ముఖంగా సీఎం ప్రకటించారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రైతులు ఎవరూ అధైర్య పడకూడదని తెలిపారు. పన్నులు చెల్లించకుండా రాష్ట్రాన్ని మోసం చేస్తున్న వారి భరతం పడతానని హెచ్చరించారు.
ఇక నుంచి మీరు ఎవరి వద్దకు వెళ్లాల్సిన పని లేదన్నారు సీఎం. ప్రభుత్వమే మీ వద్దకు వస్తుందని చెప్పారు భగవంత్ మాన్. అందుకే ఎవరికీ అన్యాయం జరగ కూడదనే ఉద్దేశంతోనే తాను అవినీతి నిరోధక హెల్ప్ లైన్ నెంబర్ 9501200200 ను ప్రారంభించడం జరిగిందన్నారు.
ఎవరైనా సరే వెంటనే తనకు వీడియో కానీ మెస్సేజ్ కానీ చేయాలని పిలుపునిచ్చారు.
Also Read : మోదీ సర్కార్ పై సార్వత్రిక సమ్మె సైరన్