The Real Yogi : పవన్ కళ్యాణ్ అంతర్ముఖుడు
నటుడు నాగేంద్రబాబు
The Real Yogi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరో పవన్ కళ్యాణ్. ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏడాదికి తక్కువ సినిమాలే చేసినా భారీ రెమ్యూనరేషన్ అందుకునే అరుదైన నటుడు. సమాజంలో సమూలమైన మార్పులు తీసుకు రావాలన్నది ఆయన కల. నటుడిగా, రాజకీయ నాయకుడిగా రెండు భిన్నమైన పాత్రలను సమర్థవంతంగా పోషిస్తున్నారు.
ఇదే సమయంలో ఆయన ఎక్కడికి వెళ్లినా , ఏ కొంత సమయం వీలు చిక్కినా పుస్తకాలను విపరీతంగా చదువుతారు. వాటిని ప్రసంగించే సమయంలో కోట్ కూడా చేస్తారు. ఆయనపై ఎందరో తమ అభిమానాన్ని చాటుకున్నారు. కానీ గణ అనే రచయిత పవన్ కళ్యాణ్ మీద ఉన్న అపరిమితమైన అభిమానంతో ఏకంగా పుస్తకాన్ని రాశారు.
ఒక రకంగా పవర్ స్టార్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. దీనికి గణ పెట్టిన పేరు ది రియల్ యోగి(The Real Yogi) . ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లో అత్యంత నిరాడంబరంగా పుస్తకావిష్కరణ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు హాజరయ్యారు.
ఆయనతో పాటు ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, దర్శకులు మెహర్ రమేష్, బాబి, ప్రవాస భారతీయురాలు, ప్యూర్ సిఇఓ శైలా తాళ్లూరి , రచయిత గణ , కాంత్ రిసా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రచయిత ఎంచుకున్న విధానం, శైలిని ప్రశంసించారు. నాగేంద్రబాబు మాత్రం తాను దేవుడిని నమ్మనని కానీ నమ్మే వాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు.
అయితే తన తమ్ముడిలో మరో కోణం ఉన్నదనేది వాస్తవమన్నారు. శైలా తాళ్లూరి మాట్లాడుతూ శైలి తనను చదించేలా చేసిందన్నారు. మెహర్ రమేష్ గణలోని ప్రత్యేకతను ప్రస్తావించారు. బాబి ఆకాశానికి ఎత్తేశారు.
Also Read : ఇదేనా న్యాయం తీరని అన్యాయం
Special book on JanaSenani @PawanKalyan – "The Real Yogi" will be launched by #Trivikram garu, Today @ Prasad Labs, Hyderabad.#TheRealYogi pic.twitter.com/2FbzzOxERC
— Trend PSPK (@TrendPSPK) December 17, 2022
Hi