Rahul Gandhi : ‘మ‌తం స‌మాన‌త్వం’ మ‌ధ్య పోరాటం

స్ప‌ష్టం చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర రాజ‌స్థాన్ లో ముగిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు సెప్టెంబ‌ర్ 6న త‌మిళ‌నాడు లోని కన్యాకుమారి నుంచి ప్రారంభించారు. యాత్ర త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య ప్ర‌దేశ్ , రాజ‌స్థాన్ ల‌లో ముగిసింది.

ఈ యాత్ర మొత్తం 150 రోజుల‌కు పైగా సాగుతుంది. ఇదే స‌మ‌యంలో ఈనెల లోనే ఢిల్లీలో యాత్ర కొన‌సాగుతుంది. ఇందులో ప్ర‌ముఖ న‌టుడు లోక నాయ‌కుడిగా పేరొందిన క‌మ‌ల్ హాస‌న్ కూడా హాజ‌రు కానున్నారు. ఇప్ప‌టికే పలువురు ప్ర‌ముఖులు రాహుల్ గాంధీకి(Rahul Gandhi) తోడుగా నిలిచారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో రెండు భావ‌జాలాలు, రెండు సిద్దాంతాల మ‌ధ్య పోరాటం కొన‌సాగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న మ‌రోసారి భార‌తీయ జ‌న‌తా పార్టీని, దాని అనుబంధ సంస్థ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నారు రాహుల్ గాంధీ.

వాళ్లు ద్వేషం ఆధారంగా స‌మాజాన్ని, మ‌నుషుల్ని విడ‌దీయాలని చూస్తున్నార‌ని ఆరోపించారు. రాజ‌కీయంగా ల‌బ్ది పొందేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. వాళ్లు మ‌తాన్ని ఆధారంగా చేసుకుని ప్రయాణం చేస్తున్నార‌ని కానీ తాము మాత్రం మ‌నుషులు, దేశం అంతా ఒక్క‌టేన‌ని భావిస్తున్నామ‌ని చెప్పారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).

ఇదిలా ఉండ‌గా దేశంలో రెండు సిద్దాంతాల మ‌ధ్య పోరు కొత్త‌ది కాద‌ని వేల ఏళ్లుగా కొన‌సాగుతున్న‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ నుంచి యాత్ర పూర్త‌యింది..హ‌ర్యానాకు చేరుకుంది.

Also Read : బీహార్ ప‌రువు తీస్తున్న కేంద్రం – తేజ‌స్వి

Leave A Reply

Your Email Id will not be published!