Mallikarjun Kharge : రైలు ప్రమాదం జాతీయ విషాదం
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జాతీయ విషాదం కంటే తక్కువ కాదన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని తెలిపారు. ఇదే సమయంలో తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న బాధితులంతా త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని వేకుంటున్నట్లు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.
ఈ ఘటనలో సహాయక చర్యలలో తమ సేవలు అందించాలని ఒడిశా కాంగ్రెస్ నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏది ఏమైనా ఇది అతి పెద్ద పూడ్చలేని ప్రమాదమని వాపోయారు. తాను తీవ్ర ఆవేదనకు గురవుతున్నానని చెప్పారు ఖర్గే. ఎవరు సాయం కోరినా ముందుండి వారికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ ఘటన మానవ తప్పిదం వల్ల జరిగిందా లేక సాంకేతిక లోపం ఏమైనా తలెత్తిందా లేక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్నది కేంద్ర సర్కార్ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాజకీయాలను పక్కన పెట్టి సత్వర సహాయక చర్యలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. అసలు వాస్తవాలు ఏమిటో వెలుగు చూడాలంటే నిష్పాక్షికమైన దర్యాప్తు సాగాలని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.
Also Read : Madan Lal