Smriti Kiran : అసాధార‌ణ విజేత‌ల అనుభ‌వాల గొంతుక

మైత్రి క్రియేట‌ర్..ఆర్ట్ డైరెక్ట‌ర్ స్మృతి కిర‌ణ్

Smriti Kiran : ఎవ‌రీ స్మృతీ కిర‌ణ్ అనుకుంటున్నారా. మోస్ట్ పాపుల‌ర్ ఇండియ‌న్ ఆర్ట్ డైరెక్ట‌ర్ అండ్ క్రియేట‌ర్. మామి సంస్థ‌కు బాధ్య‌త‌లు వ‌హిస్తున్నారు. తాజాగా దేశంలోని ప్ర‌సార‌, వినోద రంగాల‌లో పేరొందిన మ‌హిళ‌ల‌తో క‌లిసి మైత్రీ పేరుతో సీరీస్ తీస్తున్నారు.

దీనికి క‌ర్త‌, క‌ర్మ అంతా స్మృతి కిర‌ణ్(Smriti Kiran). టెక్నాల‌జీ విస్త‌రించినా, త‌రాలు మారినా ఇంకా ఈ దేశంలో మ‌హిళ‌ల ప‌ట్ల వివ‌క్ష ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఎంద‌రో మ‌హిళ‌లు అసాధార‌ణ విజ‌యాలు సాధించారు.

కానీ వారి గురించి ఈ ప్ర‌పంచానికి తెలియ‌దు. తెలిసినా అంత‌గా ప‌ట్టించుకునే వారు లేరు. ఇందుకు సంబంధించి విజేత‌లుగా ఉన్న‌త స్థానాల‌లో ఉన్న వారిని ప‌రిచ‌యం చేయాల‌ని ప్ర‌ముఖ సంస్థ అమెజాన్ నిర్ణ‌యం తీసుకుంది.

అందుకు స్మృతి కిర‌ణ్(Smriti Kiran) కు అవ‌కాశం ఇచ్చింది. దీంతో ఆమె ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. మైత్రీ క‌లెక్టివ్ విమెన్స్ సీరీస్ గురించి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు స్మృతి కిర‌ణ్.

స‌హ‌కారం, స‌మాజ నిర్మాణం , భాగ‌స్వామ్య అనుభ‌వాల‌పై అపార‌మైన న‌మ్మ‌కం ఉంది. క్రియేట‌ర్ల‌ను ఒక చోటుకు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేశా.

భార‌త దేశంలోని విభిన్న చిత్ర నిర్మాణ సంస్కృతుల మ‌ధ్య క‌మ్యూనిటీ భావాన్ని ప్రోత్స‌హిస్తాను. అంతే కాదు వారిలోని ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హిస్తాన‌ని తెలిపింది స్మృతి కిర‌ణ్. మైత్రి వెనుక ఉన్న ఆలోచ‌న స‌మైక్య‌తా భావ‌న‌.

ఇది అనుసంధానం చేసే వంతెన‌ల్ని నిర్మిస్తుంద‌న్నారు. ఐక్య‌త‌ను బ‌లాన్ని క‌లుగ చేస్తుంద‌న్నారు. సుస్థిర మార్పిడి కి దారి తీసే సంభాష‌ణ మైత్రీ ఎన్న‌టికీ ఆగ‌ద‌న్నారు.

Also Read : ఆప‌ద‌లో ఆదుకునే ఇంపాక్ట్ గురూ

Leave A Reply

Your Email Id will not be published!