YSR Awards 2022 : వైఎస్సార్-2022 పురస్కార గ్రహీతలు వీరే
ఎంపిక చేసిన స్క్రీనింగ్ కమిటీ
YSR Awards 2022 : ఈ ఏడాది 2022 సంవత్సరానికి గాను వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల గ్రహీతలను ప్రకటించింది హైపర్ స్క్రీనింగ్ కమిటీ. దర్శకులు కాశీనాథుని విశ్వనాథ్ తో పాటు ఆర్. నారాయణమూర్తికి దక్కాయి. సాహిత్య పరంగా సేవలు అందించిన సంస్థలలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ , ఎమెస్కో పబ్లిషింగ్ హౌస్ తో పాటు రచయిత్రి డాక్టర్ శాంతి నారాయణకు(YSR Awards 2022) దక్కింది.
వ్యవసాయ రంగానికి సంబంధించి ఆదివాసీ జీడిపప్పు రైతుల ఉత్పత్తిదారు కంపెనీకి చెందిన సోడెం ముక్కయ్య, కుశలవ కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల సంస్థ కు చెందిన ఎ. గోపాలకృష్ణ, అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కు చెందిన జయబ్బ నాయుడు, అమృత ఫల ఫార్మర్స్ ప్రొడ్యూర్ కంపెనీ కి చెందిన కేఎల్ఎన్ మౌక్తికా, కట్టమంచి బాలకృష్ణా రెడ్డిలకు అవార్డులు లభించాయి.
మహిళా సాధికారత కింద ప్రజ్వల ఫౌండేషన్ కు చెందిన సునీత కృష్ణన్ , శిరీష పునరావాస కేంద్రం, దిశ పోలీసింగ్ , దిశ యాప్ ద్వారా నిమిషాల్లో చేరుకుని ఆదుకున్న ఐదుగురు పోలీసులకు సంయుక్తంగా ప్రకటించారు. రావాడ జయంతి, ఎస్వీవీ లక్ష్మినారాయణ, రాయుడు సుబ్రమణ్యం, హజరత్య, పి. శ్రీనివాస్ సంయుక్తంగా ఎంపికయ్యారు.
ఇక విద్యా రంగం కింద మదనపల్లిలోని రిషి వాలీ విద్యా సంస్థ, కావలిలోని జవహర్ భారతి విద్యా సంస్థ ఎంపిక కాగా వ్యక్తిత్వ వికాసం కింద బివి పట్టాభిరామ్ ను ఎంపికయ్యారు.
బ్యాంకింగ్ రంగంలో దస్తగిరి రెడ్డి ని వరించింది. ఇక మీడియా పరంగా బండారు శ్రీనివాసరావు, సతీష్ చందర్ , మంగు రాజగోపాల్, ఎంఈవీ ప్రసాదరెడ్డి ఎంపికయ్యారు. వైద్య రంగంలో డాక్టర్ వరప్రసాద రెడ్డి, డాక్టర్ బి. నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా, ప్రతాప్ సి రెడ్డి, గుళ్లపల్లి నాగేశ్వర్ రావు లను ఎంపిక చేసింది.
Also Read : విశ్వనాథ్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు