Team India Loss : భార‌త్ ఓట‌మికి ఎన్నో కార‌ణాలు

ల‌క్ష్మ‌ణ్..బీసీసీఐ బాధ్య‌త వ‌హించాలి

Team India Loss : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీ ఫైన‌ల్ లో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓట‌మి(Team India Loss) పాలైంది భార‌త జ‌ట్టు. ఏకంగా 10 వికెట్ల తేడాతో ప‌రాజయం పొంది ప‌రువు పోగొట్టుకుంది. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వాకం , సెలెక్ష‌న్ క‌మిటీ ఎంపిక విధానం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

వ‌రుస‌గా రిష‌బ్ పంత్ ఫెయిలైనా కంటిన్యూగా ఎంపిక చేస్తూ వ‌చ్చారు. ఇక న్యూజిలాండ్ సీరీస్ కు కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ ను ఎంపిక చేసినా దూరం పెట్టారు. ఇక పాండ్యా సార‌థ్యంలోని టీమిండియా 1-0తో టి20 సీరీస్ గెలుచుకుంది. ఇక వెట‌ర‌న్ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ నేతృత్వంలోని వ‌న్డే సీరీస్ 1-0 తేడాతో పోగొట్టుకుంది.

రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, ర‌విచంద్ర‌న్ అశ్విన్ లేకుండానే కీవీస్ టూర్ ముగిసింది. విశ్రాంతి పేరుతో హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ను ప‌క్క‌న పెట్టారు. ఏదో ఉద్ద‌రిస్తాడ‌ని వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ను తాత్కాలిక కోచ్ గా ఎంపిక చేసింది బీసీసీఐ(BCCI).

ఆయ‌న చేసిన నిర్వాకం ఏమిటంటే అటు టి20 సీరీస్, వ‌న్డే సీరీస్ ల‌లో రాణించ‌క పోయినా రిష‌బ్ పంత్ ను ఎంపిక చేస్తూ వ‌చ్చారు. కేవ‌లం ఒక్క మ్యాచ్ లో మాత్రమే సంజూ శాంస‌న్ ను ఆడించారు. ఉద్ద‌రిస్తార‌ని అనుకున్న రిష‌బ్ పంత్ , సూర్య కుమార్ యాద‌వ్ నిరాశ ప‌రిచారు.

ప‌స లేని బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌ధాన కార‌ణం. విచిత్రం ఏమిటంటే మ్యాచ్ ప‌రంగా నెంబ‌ర్ 4వ స్థానంలో బాగా ఆడ‌తాడ‌ని పంత్ ను ఎంపిక చేశామ‌ని చెప్పాడు ల‌క్ష్మ‌ణ్. మొత్తంగా భార‌త జ‌ట్టు ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం రిష‌బ్ పంత్. బీసీసీఐలో చోటు చేసుకున్న రాజ‌కీయ‌లు కూడా ఇందులో కీల‌కంగా మారాయి.

Also Read : బీసీసీఐ చీఫ్ కు ఎథిక్స్ ఆఫీసర్ నోటీసు

Leave A Reply

Your Email Id will not be published!