Mamata Banerjee : పోరాటం త‌ప్ప పొత్తులుండ‌వు – దీదీ

కాంగ్రెస్, బీజేపీల‌పై భ‌గ్గుమ‌న్న సీఎం

Mamata Banerjee Alliance  : ఈశాన్యంలో టీఎంసీ స‌త్తా చాటింది. కానీ ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌క పాత్ర క‌న‌బ‌ర్చ‌లేక పోయింది. అయినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. కీల‌క వ్యాఖ్య‌లు చేసింది రాబోయే ఎన్నిక‌ల గురించి.

భార‌తీయ జ‌న‌తా పార్టీకి దేశంలో ప్ర‌త్యామ్నాయం ఒక్క త‌మ పార్టీ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌ని తెలిపింది. త‌మ ప‌ట్ల ప్ర‌జ‌లు అత్యంత ఆస‌క్తితో ఎదురు చూస్తున్నార‌ని సీఎం స్ప‌ష్టం చేసింది. ఇక ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో టీఎంసీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతుంద‌ని రాబోయే కాలం త‌మ‌దేన‌ని ప్ర‌క‌టించింది.

టీఎంసీ ఏ పార్టీతోను జ‌త క‌ట్ట బోదంటూ డిక్లేర్ చేసింది దీదీ. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తుంది త‌మ పార్టీ. దేశ వ్యాప్తంగా త్వ‌ర‌లోనే విస్త‌రించ బోతోంద‌న్నారు మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee Alliance). ఆయా పార్టీలు ప్ర‌జ‌ల విశ్వాసాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేద‌ని ఆరోపించింది.

అందుకే వాటిని ఆద‌రించ‌డం లేద‌న్నారు. ఇక కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ కేవ‌లం బీజేపీయేత‌ర రాష్ట్రాల‌ను, సంస్థ‌ల‌ను, నాయ‌కుల‌ను టార్గెట్ చేయ‌డమే ప‌నిగా పెట్టుకుంద‌ని ధ్వ‌జ‌మెత్తింది. 2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో కాషాయాన్ని బండ‌కేసి కొడ‌తార‌ని జోష్యం చెప్పింది దీదీ.

దేశంలో బీజేపీతో పాటు కాంగ్రెస్, క‌మ్యూనిస్టుల‌తో పోరాడేందుకు తాను ఒక్క‌దాన్నే చాల‌న్నారు మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee). 2021లో ప‌శ్చిమ బెంగాల్ లో వ‌చ్చిన ఫ‌లితాలే దేశ వ్యాప్తంగా వ‌స్తాయ‌ని అన్నారు.

టీఎంసీని జ‌నం త‌మ పార్టీగా భావిస్తున్నార‌ని అందుకే మేఘాల‌య‌లో త‌మ‌ను ఆద‌రించార‌ని, 137 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వ‌చ్చాయ‌ని తమ‌కు కూడా అన్నే సీట్లు వ‌చ్చాయంటూ ఎద్దేవా చేశారు సీఎం. ఇక దీదీ ప్ర‌క‌ట‌న‌తో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు బిగ్ షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.

Also Read : మేఘాల‌య జ‌నం సంగ్మాకే ప‌ట్టం

Leave A Reply

Your Email Id will not be published!