Poonam Kaur : వేధించిన వాళ్లను చంపేస్తే తప్పేంటి
నటి పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్
Poonam Kaur Suicide cases : నటి పూనమ్ కౌర్(Poonam Kaur) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజ్ భవన్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. మహిళలపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని, ఆత్మహత్యలకు కారణం ఎవరో ఆలోచించాలన్నారు.
వేధింపులకు గురి చేసి , మానసికంగా హింసించే వాళ్లు చంపేస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇందు కోసమేనా తెచ్చుకున్నది అని నిలదీశారు పూనమ్ కౌర్. కొత్త రాష్ట్రానికి ఒకరు లేదా ఇద్దరేనా ప్రతినిధులు .. వేరే వాళ్లు లేరా అని నిప్పులు చెరిగింది.
ప్రశ్నిస్తే అణిచి వేస్తున్నారు. నిలదీస్తే నామ రూపాలు లేకుండా చేస్తున్నారు. ఇలాంటి తెలంగాణను ప్రజలు కోరుకోలేదన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఆడవాళ్లపై ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరినీ రాజకీయాలతో ముడిపెట్టి చూస్తున్నారని ఆరోపించారు. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోందన్నారు పూనమ్ కౌర్. తాను ఇక్కడే పుట్టానని కానీ తనను వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పరిగణిస్తున్నారని ఆరోపించారు.
రాళ్లు వేసిన వాళ్లకే అందలం ఎక్కిస్తున్నారని, వారికే ప్రయారిటీ ఇస్తున్నారంటూ ధ్వజమెత్తారు నటి. ఇకనైనా మహిళలు, యువతులు ఆందోళన చెంద కూడదన్నారు. నిగ్గదీసి నిలదీయాలని పిలుపునిచ్చారు పూనమ్ కౌర్(Poonam Kaur Suicide cases). వేధించే వాళ్లను చంపేయండి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆత్మహత్యలు వద్దని ఆకతాయిలను వెంట పడి తరమాలని కోరారు పూనమ్ కౌర్. ప్రీతి మరణంపై ఆమె కంటతడి పెట్టారు. చివరకు నా మతాన్ని సాకుగా చూపి తనను అవమానానికి గురి చేస్తున్నారంటూ వాపోయారు.
Also Read : నిశ్శబ్దం ఎప్పుడూ శాంతిని ఇవ్వదు