Philipp Ackermann : భార‌త దేశం త‌ప్పేమీ లేదు – అకెర్ మాన్

జ‌ర్మ‌నీ విదేశాంగ మంత్రి ఆరోప‌ణ‌లు అబ‌ద్దం

Philipp Ackermann : భార‌త దేశంలో జ‌రిగిన విదేశాంగ శాఖా మంత్రుల స‌మావేశంలో పాల్గొనేందుకు జ‌ర్మ‌నీ దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి అన్నాలెనా బేర్ బాక్ హాజ‌ర‌య్యారు. అయితే ప్రోటోకాల్ పాటించ‌లేదంటూ ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై భార‌త దేశంలో జ‌ర్మ‌నీ రాయ‌బారి ఫిలిప్ అకెర్ మాన్(Philipp Ackermann)  స్పందించారు.

మంగ‌ళ‌వారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. త‌న దేశ‌పు విదేశాంగ శాఖ మంత్రి చేసిన ఆరోప‌ణ‌ల‌ను పూర్తిగా తోసిపుచ్చారు. ఇది పూర్తిగా త‌మ స‌మ‌స్య అని, భార‌త దేశానికి ఇందులో ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆమె అవ‌గాహ‌న లోపం వ‌ల్ల అలా మాట్లాడింద‌ని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేచేశారు ఫిలిప్ అకెర్ మాన్.

ఈ ప‌ర్య‌ట‌న‌లో పూర్తిగా ఆమెదే త‌ప్ప‌ని పేర్కొన్నారు. ఇది పూర్తిగా త‌మ దేశం జ‌ర్మ‌నీకి సంబంధించిన స‌మ‌స్య‌గా పేర్కొన్నారు ఆ దేశ‌పు రాయ‌బారి. ఇందుకు సంబంధించి ఆయ‌న క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. జ‌ర్మ‌నీ విదేశాంగ మంత్రి విమానం ఢిల్లీలో స‌మయానికి ముందే ల్యాండ్ అయ్యింద‌ని తెలిపారు. లోపలే ఉండాల్సింగా కోరామ‌ని అక‌ర్ మాన్ వివ‌రించారు.

మేము ఆమెను కాన్ఫ‌రెన్స్ సెంట‌ర్ కు బ‌దిలీ చేయాల్సి వ‌చ్చింది. ఆమె కొంచెం తొంద‌ర‌గా ఉంద‌ని చెప్పారు. జ‌ర్మ‌నీ అధికారులు ఫ్లైట్ లోనే కొద్ది సేపు ఆగ‌మ‌ని కోరార‌ని వెల్ల‌డించారు. త‌ను దానికి ఒప్పుకోలేద‌న్నారు. ఇందులో భార‌త దేశం నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేద‌ని పేర్కొన్నారు ఫిలిప్ అకెర్ మాన్(Philipp Ackermann) . స‌మాచారంలో స‌మ‌న్వ‌య లోపం కార‌ణంగా జ‌రిగిన పొర‌పాటు అని, ఇది త‌మ‌దేన‌ని భార‌త్ ది కాద‌ని తెలిపారు.

Also Read : ఆర్ఎస్ఎస్ మ‌తోన్మాద తీవ్ర‌వాద సంస్

Leave A Reply

Your Email Id will not be published!