Amit Shah Punjab : పంజాబ్ లో ఖలిస్తానీ వాదం లేదు – షా
స్పష్టం చేసిన కేంద్ర మంత్రి
Amit Shah Punjab : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన ప్రకటన చేశారు. పంజాబ్ లో ఖలిస్తానీ ఉద్యమం ఊసే లేదని స్పష్టం చేశారు. ఇక ఇటీవల కీలకంగా మారిన వారిస్ దే పంజాబ్ చీఫ్ , ఖలిస్తానీ ఉద్యమ మద్దతుదారు అమృత పాల్ సింగ్ గురించి ప్రస్తావించారు. ఒకరో లేదా ఇద్దరి వల్ల ఉద్యమం ఉందని అనుకోవడం పొరపాటేనని పేర్కొన్నారు.
ఎక్కడ ఉన్నా పట్టుకుని తీరుతామని ప్రకటించారు. ఇదే సమయంలో పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. అమృత పాల్ సింగ్ చీఫ్ గా ఉన్న సంస్థపై చర్యలు తీసుకున్నందుకు అభినందించారు అమిత్ షా(Amit Shah Punjab).
తమ నుంచి తప్పించు కోవడం సాధ్యం కాదన్నారు. ఎవరైనా సరే ఈ దేశంలో ఉన్నంత వరకు ఎక్కడికీ వెళ్లలేరని హెచ్చరించారు. వేర్పాటు వాద ఉద్యమాలకు, శక్తులకు ఇక్కడ స్థానం లేదన్నారు. మాఫియాలు, డాన్ లు, నేరస్థులు ఎక్కడ ఉన్నా వారిని తుద ముట్టిస్తామన్నారు.
కొంత కాలం వేచి చూస్తామని ఆ తర్వాత వేచి ఉండే ప్రసక్తి లేదన్నారు కేంద్ర మంత్రి(Amit Shah). ఉగ్రవాదులను, సంఘ విద్రోహ శక్తులను అణిచి వేసేందుకు ఎలాంటి సహాయం చేసేందుకైనా కేంద్రం ముందు ఉంటుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు కేంద్ర మంత్రి. పంజాబ్ లో ఖలిస్తానీ వేవ్ లేదని, పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు.
Also Read : సత్యపాల్ మాలిక్ ను అరెస్ట్ చేయలేదు