Shibu Soren HC : సిబూ సోరేన్ కేసులో వాయిదాలు ఉండ‌వు

లోక్ పాల్ చ‌ర్య‌ల‌ను స‌వాల్ చేసిన మాజీ సీఎం

Shibu Soren HC : జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరేన్(Shibu Soren) కు సంబంధించిన లోక్ పాల్ కేసులో కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ మేర‌కు ఈ కేసుకు సంబంధించి వాయిదాలు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ కి చెందిన ఎంపీ నిషికాంత్ దూబే ఫిర్యాదు చేశారు. దీంతో లోక్ పాల్ మాజీ సీఎంపై చ‌ర్య‌లు ప్రారంభించింది.

దీనిని స‌వాల్ చేస్తూ శిబూ సోరేన్ కోర్టులో స‌వాల్ చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ , మాజీ సీఎం శిబూ సోరేన్(Shibu Soren) వేసిన పిటిష‌న్ పై త‌దుప‌రి వాయిదా వేయ‌బోమంటూ ఢిల్లీ హైకోర్టు బుధ‌వారం స్ప‌ష్టం చేసింది. సోరేన్ త‌ర‌పున దాఖ‌లు చేసిన న్యాయ‌వాదికి వ్య‌క్తిగ‌త ఇబ్బందులు ఉన్నాయ‌ని కోర్టుకు విన్న‌వించారు.

దీనిని తీవ్రంగా వ్య‌తిరేకించారు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా. వాయిదా అభ్య‌ర్థ‌న‌ను ఒప్పుకోలేదు. లోక్ పాల్ త‌ర‌పున ఆయ‌న వాదిస్తున్నారు. ఈ మొత్తం కేసును ఇవాళ విచార‌ణ చేప‌ట్టారు జ‌స్టిస్ ప్ర‌తిభా ఎం సింగ్. ఈ అంశాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అయితే ఇక నుంచి ఎలాంటి వాయిదా మంజూరు చేయ‌డం కుదర‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఈ కేసుకు సంబంధించి ఫిబ్ర‌వ‌రి 8, 2023న త‌దుప‌రి విచార‌ణ కోసం హైకోర్టు ఈ అంశాన్ని జాబితా చేసింది. అప్ప‌టి వ‌ర‌కు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు కొన‌సాగుతుంద‌ని పేర్కొంది కోర్టు.

సెప్టెంబ‌ర్ 12న ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ‌గా , లోక్ పాల్ చ‌ర్య‌ల‌పై కోర్టు స్టే విధించింది.

Also Read : సోనియా ఆధ్వ‌ర్యంలో స‌భ్యులు వాకౌట్

Leave A Reply

Your Email Id will not be published!