PM Modi : పేద‌రికం పేరుతో రాజ‌కీయం చేశారు

గ‌త పాల‌కుల‌పై ప్ర‌ధాన‌మంత్రి మోదీ

PM Modi Accused : గ‌త పాల‌కుల తీరుపై నిప్పులు చెరిగారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. పేద‌రికాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో వాళ్లు విజ‌యం సాధించారంటూ ఎద్దేవా చేశారు. శ‌నివారం ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని, పేద‌రికాన్ని ప‌దే ప‌దే బూచిగా చూపించి త‌మ ప‌బ్బం గ‌డుపుకున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు న‌రేంద్ర మోదీ(PM Modi Accused).

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో విఫలం అయ్యార‌ని మండిప‌డ్డారు. ఇవాళ 75 ఏళ్ల‌యినా ఇంకా దేశం ఇబ్బందుల్లో ఉందంటే అది కాంగ్రెస్ చేసిన నిర్వాకం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. తాము ఎప్పుడైతే ప‌వ‌ర్ లోకి వ‌చ్చామో ఆనాటి నుంచే భార‌త దేశం ఒక వెలుగు వెల‌గ‌డం ప్రారంభ‌మైంద‌న్నారు. తాము మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇచ్చామ‌ని చెప్పారు మోదీ.

దీని వ‌ల్ల ఆయా రాష్ట్రాలు అభివృద్ది ప‌థంలో ముందుకు వెళుతున్నాయ‌ని తెలిపారు. రోడ్లు, ఎయిర్ పోర్టులు, ఓడ రేవులు ఇలా ప్ర‌తిదానిని క‌నెక్టివిటీని చేయ‌డం వ‌ల్ల దేశం ప‌రుగులు తీస్తోంద‌ని అన్నారు ప్ర‌ధాన‌మంత్రి.

ఇవాళ ఎయిర్ పోర్టులు కొత్త‌గా రూపు దిద్దుకుంటున్నాయి. ఓడ రేవులు క‌ళ క‌ళ లాడుతున్నాయి. ర‌హ‌దారులతో ఆయా ప్రాంతాల మ‌ధ్య దూరం త‌గ్గింద‌న్నారు. 2014కి ముందు ఏడాదికి 600 రూట్ ట్రాక్ విద్యుదీక‌రించార‌ని కానీ తాము వ‌చ్చాక అది 4,000 కిలోమీట‌ర్ల‌కు చేరుకుంద‌న్నారు. ఇదంతా గుర్తించి ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల వ‌చ్చింద‌న్నారు న‌రేంద్ర మోదీ(PM Modi).

ఇపుడు మ‌న దేశం వైపు ప్ర‌పంచ దేశాలు చూస్తున్నాయ‌ని అన్నారు. యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోతోంద‌ని , అందుకే ఇవాళ జి20 కి మ‌న‌మే నాయ‌క‌త్వం వ‌హిస్తున్నామ‌ని చెప్పారు.

Also Read : రాహుల్ కామెంట్స్ బీజేపీ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!