Lionel Messi : ఈ విజయం దేశానికి అంకితం – మెస్సీ
మా అందరి కష్టార్జితం ఈ గెలుపు
Lionel Messi : నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్ లో బలమైన క్రొయేషియాను 3-0 తేడాతో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఓడించి ఘన విజయాన్ని నమోదు చేసింది.
మ్యాచ్ అనంతరం జట్టు స్కిప్పర్ మెస్సీ(Lionel Messi) మీడియాతో మాట్లాడాడు. టోర్నీ కంటే ముందు మేం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఎలాగైనా సరే ఫుట్ మాంత్రికుడు, దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా కోసం ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను అందించాలన్నది మా కల. అదే మా ఆశయం..లక్ష్యం కూడా.
అందుకే ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఫుట్ బాల్ సమరంలో చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నామన్నాడు మెస్సీ. మైదానంలో ఎలా ఉంటామో బయట కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొన్నాడు. ఎందుకంటే ఇది కనిపించని యుద్దం. కోట్లాది మంది మాపై ఆశలు పెట్టుకున్నారు. ఏ మాత్రం ఆటలో వెనుకంజ వేసినా లేదా ఏ చిన్న తప్పు జరిగినా మేం దానికి బాధ్యత వహించాల్సి వస్తుందన్నాడు మెస్సీ.
జట్టుకు నేను నాయకత్వం వహించడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఎలాగైనా సరే ప్రపంచ కప్ ను సాధించి నా దేశం గర్వ పడేలా, నా ప్రజలు తల ఎత్తుకునేలా చేయాలన్నది మా అందరి ఆశయం.
ఇవాల్టి గెలుపు నా ఒక్కడిదే అనుకుంటే పొరపాటు పడినట్టే. ఈ అద్భుత విజయంలో జూలియన్ అల్వారెజ్ రెండు గోల్స్ చేశాడు. అతడి అటాకింగే తమ జట్టుకు బలంగా మారిందన్నాడు మెస్సీ.
Also Read : అర్జెంటీనా అరుదైన ఘనత