MK Stalin : ఈ విజ‌యం ద్రావిడ మోడ‌ల్ కు ఆమోదం

త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కామెంట్స్

MK Stalin Dravidian model : డీఎంకే చీఫ్‌, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నిక‌లో అధికార డీఎంకే మ‌ద్ద‌తు గ‌ల కాంగ్రెస్ అభ్య‌ర్థి తిరుగులేని ఆధిక్యంతో విజ‌యం సాధించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన విజ‌యోత్స‌వ యాత్ర‌లో ఎంకే స్టాలిన్ ప్ర‌సంగించారు. ఈ గెలుపు ద్రావిడ మోడ‌ల్ కు ప్ర‌జ‌లు ఆమోదం తెలిపార‌ని చెప్పారు.

ప్ర‌చార స‌మయంలో నేను ద్రావిడ న‌మూనా పాల‌న‌కు మ‌ద్దతు ఇవ్వాల‌ని ప‌దే ప‌దే కోరార‌ని అన్నారు సీఎం. అది మ‌రింత శ‌క్తితో జ‌ర‌గాల‌ని ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చార‌ని, ఇంత‌టి ఘ‌న విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టినందుకు ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. డీఎంకే ద్రావిడ పాల‌నా న‌మూనాను స‌మ‌గ్ర అభివృద్ది న‌మూనాగా పేర్కొన్నారు ఎంకే స్టాలిన్(MK Stalin Dravidian model).

త‌మిళ‌నాడులో డీఎంకే కొలువు తీరి 22 నెల‌లు అవుతోంది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా ఉండేలా పాల‌న సాగిస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌కృతి ప‌రంగా విప‌త్తుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డగలిగామ‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో క‌ష్ట కాలంలో క‌రోనా మ‌హ‌మ్మారిని కూడా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోగ‌లిగామ‌ని స్ప‌ష్టం చేశారు ఎంకే స్టాలిన్(MK Stalin).

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఈవీకేఎస్ ఇళంగోవ‌న్ బ‌రిలో ఉండ‌గా అన్నాడీఎంకేకు చెందిన కేఎస్ తెన్న‌ర‌సు నిలిచారు. చివ‌ర‌కు డీఎంకే మ‌ద్ద‌తుతో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేశారు. ఈ సంద‌ర్భంగా డీఎంకే చీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చార‌రిత్ర‌క , గొప్ప విజ‌యంతో రాబోయే 2024లో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యుల‌ర్ ప్రోగ్రెసివ్ అల‌య‌న్స్ ముందుకు సాగుతుంద‌న్నారు.

Also Read : బీజేపీ మిత్ర‌ప‌క్షాల‌ క్లీన్ స్వీప్

Leave A Reply

Your Email Id will not be published!