Lightning Strike: క్వారీలో పిడుగు పడి ముగ్గురు మృతి ! మరో నలుగురికి గాయాలు !

క్వారీలో పిడుగు పడి ముగ్గురు మృతి ! మరో నలుగురికి గాయాలు !

Lightning Strike : శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని జంగలపాడు రాజయోగి క్వారీలో విషాద ఘటన జరిగింది. పిడుగు పడటంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే టెక్కలి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో బైపోతు హరిప్రసాద్ పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన సాయంత్రం చీకటి పడిన సమయంలో జరగడంతో సహాయక చర్యలు నిర్వహించడంలో అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చీకటి కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు కలిగాయి. అయినప్పటికీ, స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు.

Lightning Strike in Srikakulam

మృతి చెందిన వారిలో కూలీలు శ్రావణ్ కుమార్ (45, బీహార్), హేమరాజ్ ఈశ్వజీ మేఘవల్ (25, రాజస్థాన్), పింటు (25, మధ్యప్రదేశ్)గా గుర్తించారు. వీరు రాజయోగి క్వారీలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్న వలస కూలీలు. పిడుగుపాటు ఘటన వారి కుటుంబాలను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. ఈ ఘటన స్థానికంగా షాక్‌కు గురిచేసింది. క్వారీలో పనిచేసే కూలీల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. పిడుగు పడే సమయంలో కూలీలు బహిరంగ ప్రదేశంలో పనిచేస్తుండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు, కూలీల భద్రత కోసం క్వారీ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Lightning Strike – అనంతపురం శిశు గృహంలో పసికందు మృతి

అనంతపురం శిశు గృహంలో పసికందు మృతి ఘటనకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి నాగమణిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. శిశుగృహంలో జరిగే అక్రమాలు, అవకతవకలకు సంబంధించి పర్యవేక్షణ లోపం ఉండటంతోనే ఆమెపై చర్యలు తీసుకున్నారు. శిశు గృహంలో ఈనెల 2న 32 రోజుల పసికందు నిరూప్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. శిశువు మృతిపై నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళ… తనకు జన్మించిన మగ శిశువును పోషించలేక ఆగస్టు 30న అనంతపురంలోని ఐసీడీఎస్‌ అనుబంధ శిశుగృహకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ శిశువు ఇక్కడే ఉంటున్నాడు. దసరా పండగ రోజు (2వ తేదీ) రాత్రి ఇద్దరు ఆయాలు విధుల్లో ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే వచ్చారు. అర్ధరాత్రి హఠాత్తుగా పసికందు ఆరోగ్యం బాగోలేదంటూ సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృత్యువాత పడినట్లు వైద్యులు చెప్పారు. ఇది బయటకు పొక్కకుండా శ్మశానంలో పూడ్చేయగా… సిబ్బంది మధ్య గొడవలతో విషయం బయటకు పొక్కింది.

Also Read : PM Narendra Modi: ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన

Leave A Reply

Your Email Id will not be published!