Road Accident: కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు

కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు

Road Accident : బాపట్ల జిల్లా మార్టూర్ మండలం కొల్లపూడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కుక్కను తప్పించబోయిన కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వారిని లక్ష్మణ్ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్ (25)గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. బాధితులు గుంటూరు నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Road Accident – ప్రొద్దుటూరులో అపహరణకు గురై… కుందూ నదిలో శవమై తేలిన వడ్డీ వ్యాపారి

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి అప‌హ‌ర‌ణ‌కు గురైన వడ్డీ వ్యాపారి వేణుగోపాల్‌రెడ్డి కుందూన‌దిలో శ‌వ‌మై తేలారు. అగ్నిమాపక అధికారులు, పోలీసులు.. మృత‌దేహాన్ని గుర్తించి వెలికి తీశారు. ప్రొద్దుటూరులోని బొల్లవరానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి వ‌డ్డీకి అప్పులు ఇస్తుంటారు. పట్టణంలోని ప‌లువురికి అప్పు ఇవ్వగా.. వారు తిరిగి చెల్లించ‌క‌పోవ‌డంతో ప‌లుమార్లు గొడ‌వ‌లు జ‌రిగాయి. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వేణుగోపాల్‌ రెడ్డి (Venugopal Reddy) కళ్లలో కారం చల్లి.. దుండగులు అపహరించారు. ఆ తర్వాత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కుందూ నదిలో పడేశారు.

పోలీసులు తొలుత అదృశ్యం కేసు నమోదు చేయగా… విచారణ అనంతరం కిడ్నాప్ కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. అపహరించి హత్య చేసి ఉంటారన్న అనుమానంతోనే పోలీసుల దర్యాప్తు సాగింది. ఆ క్రమంలోనే కుందునదిలో ఉదయం నుంచి అగ్నిమాపక అధికారులు, పోలీసులు గాలింపు చేపట్టగా సాయంత్రం చాపాడు సమీపంలో కుందూనది వద్ద మృతదేహం గుర్తించి వెలికి తీశారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వేణుగోపాల్ రెడ్డి హత్యకు గురయ్యాడన్న విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. హత్య చేసింది ఎవరన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

Also Read : Yanamala Rama Krishnudu: అనర్హత వేటు నిబంధనలపై జగన్ పై యనమల సెటైర్లు

Leave A Reply

Your Email Id will not be published!