Fishing Harbor Blast: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో పేలుడు ! ముగ్గురు మృతి !
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో పేలుడు ! ముగ్గురు మృతి !
Fishing Harbor : విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని వెల్డింగ్ షాపులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలోముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు గాయాలపాలైనట్లు అధికారులు ప్రకటించారు. వెల్డింగ్ షాప్ ఓనర్ గణేష్‌తో మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీససులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను విశాఖ (Vizag) కేజీహెచ్ కు తరలించి చికిత్స అందించారు.
Fishing Harbor Blast Viral
ప్రమాద ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సందర్శించారు. అక్కడ ప్రమాదం జరిగిన తీరును సమీక్షించారు. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా ఉన్న ఇనుప సామగ్రి, ప్రమాదానికి కారణమైన గ్యాస్ సిలిండర్ ను, వెల్డింగ్ దుకాణాన్ని పరిశీలించారు. పోలీసు, రెవెన్యూ అధికారులు, స్థానికులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి కేజీహెచ్ క్యాజువాలిటీని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించారు. అక్కడ నుంచి బర్న్స్ వార్డులో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఎమ్మెల్యే, కలెక్టర్ కేజీహెచ్ వైద్యాధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షించాలని చెప్పారు.
ఫిషింగ్ హార్బర్ (Fishing Harbor) ప్రమాదంపై జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి (Minister Dola) దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.
సిలిండర్ పేలుడు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన నలుగురిని అధికారులు కేజీహెచ్ కు తరలించారు. చల్ల గణేశ్ కుమార్, శ్రీను అనే ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోయారని, తీవ్రంగా గాయపడ్డ నలుగురిని కేజీహెచ్ కు తరలించామని చెప్పారు. వారికి మెరుగైన వైద్యం అందుతోందన్నారు. అయితే క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న సీహెచ్. ముత్యాలు అనే వ్యక్తి గురువారం రాత్రి 8.00 గంటల దాటిన తర్వాత చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బర్న్స్ వార్డులో చికిత్స పొందుతున్న ముగ్గురిలో టి. సన్యాసి అనే వ్యక్తిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరింత మెరుగైన వైద్యం కోసం వైద్యాధికారులు మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఇ. రంగారావు, ఎర్ర ఎల్లాజీ ప్రస్తుతం కేజీహెచ్ బర్న్స్ వార్డులో చికిత్స పొందుతున్నారు.
తాజాగా.. ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. నగర పోలీస్ కమిషనర్, ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు హోం మంత్రి అనిత ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Also Read : YSRCP Leaders: టీడీపీ నాయకుల అరాచకంపై గవర్నర్ కు వైసీపీ ఫిర్యాదు
