Tirumala Updates : పోటెత్తిన భ‌క్త‌జ‌నం ద‌ర్శ‌నం క‌ష్టం

తిరుమ‌ల‌లో సంద‌డే సంద‌డి

Tirumala Updates : వ‌రుస వేస‌వి సెల‌వులు కావ‌డంతో తిరుమ‌ల భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకునేందుక(Tirumala Updates) భారీ ఎత్తున బారులు తీరారు భ‌క్త‌జ‌నం. ఇప్ప‌టికే ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఏర్పాట్లు చేసింది.

టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. భ‌క్తుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాలు ఏర్పాటు చేయాల‌ని సిబ్బందిని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్, కంపార్ట్ మెంట్స్ ల‌లో వేచి ఉన్న భ‌క్తుల‌కు ఉచితంగా నీరు, మ‌జ్జిగ‌, పాలు, అన్న‌దానం చేస్తున్న‌ట్లు తెలిపారు.

చంటి పిల్ల‌ల త‌ల్లులు, వృద్దుల‌కు త్వ‌రిత‌గ‌తిన స్వామి వారి ద‌ర్శ‌నం అయ్యేలా ఏర్పాటు చేసింది టీటీడీ(Tirumala Updates). భ‌క్తుల తాకిడికి ఎక్కువ కావ‌డంతో ఇప్ప‌టి దాకా 20 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నారు భ‌క్తులు. ఇదిలా ఉండ‌గా టోకెన్లు లేని భ‌క్తుల‌కు స‌ర్వ ద‌ర్శ‌నం క‌లిగేందుకు 24 గంట‌ల‌కు పైగా ప‌డుతుంద‌ని టీటీడీ వెల్ల‌డించింది.

ఇక శ‌నివారం ఒక్క రోజే క‌లియుగ దైవాన్ని 75 వేల మందికి పైగా భ‌క్తులు ద‌ర్శించుకున్నార‌ని టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి వెల్ల‌డించారు. 37 వేల మందికి పైగా త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నార‌ని పేర్కొన్నారు. హుండీ ఆదాయం రూ. 3.21 కోట్లు వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : విస్తృత ఏర్పాట్లు మెరుగైన సేవ‌లు

Leave A Reply

Your Email Id will not be published!