Tirumala Gokulastami : తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి
ఘనంగా ఉట్ల ఉత్సవం
Tirumala Gokulastami : తిరుమల : తిరుమలలో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
గోగర్భం డ్యామ్ చెంతగల ఉద్యానవనంలో కాళీయ మర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం పంచాభిషేకాలు చేశారు. అనంతరం అక్కడ ఉట్లోత్సం నిర్వహించారు. ఆ తరువాత ప్రసాద వితరణ చేపట్టారు.. ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్, విజివో శ్రీ బాలి రెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tirumala Gokulastami Viral
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 8 నుండి 10 గంటల నడుమ శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి(Tirumala Gokulastami) ఆస్థానం ఘనంగా చేపడతారు.
సెప్టెంబర్ 8న శుక్రవారం తిరుమలలో సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహిస్తారు. శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణ స్వామి వారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఈ ఉట్లోత్సవాన్ని తిలకిస్తారు.
దీంతో ఎప్పటి లాగే తిరుమలలో నిర్వహించే శ్రీవారి ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఈ విషయాన్ని వెల్లడించింది అధికారికంగా.
Also Read : RK Roja Selvamani : దుర్గమ్మ సన్నిధిలో రోజా