Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.15 కోట్లు
దర్శించుకున్న భక్తులు 63,021
Tirumala Hundi : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్తుల సందడితో నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వెల్లడించింది. ఈ మేరకు ఈవో ఏవీ ధర్మా రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది, శ్రీవారి సేవకులు సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు.
Tirumala Hundi in one Day
ఇదిలా ఉండగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు బారులు తీరారు భక్త బాంధవులు. స్వామి వారిని 63 వేల 23 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 91 మంది భక్తులు తల నీలాలు సమర్పించినట్లు టీటీడీ స్పష్టం చేసింది.
భక్త బాంధవులు నిత్యం స్వామి వారికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.15 కోట్లు వచ్చిందని స్పష్టం చేశారు టీటీడీ కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి. మరో వైపు స్వామి వారి దర్శనం కోసం 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందని వెల్లడించారు.
Also Read : Revanth Reddy Review : టీఎస్పీఎస్సీ ప్రక్షాళన షురూ