Tirumala Hundi : శ్రీవారి ఆదాయం రూ. 4.19 కోట్లు
దర్శించుకున్న భక్తులు 67,198
Tirumala Hundi : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. రోజు రోజుకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజే భక్తుల సంఖ్య 67 వేల 198 మంది చేరుకుంది.
Tirumala Hundi Updates
22 వేల 452 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి సంబంధించి భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.19 కోట్లు సమకూరినట్లు స్పష్టం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) .
సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసల కోర్చి శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శనం చేసుకునేందుకు తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది టీటీడీ పాలక మండలి.
ఇదిలా ఉండగా భక్తులు శ్రీవారిని దర్శించు కునేందుకు తిరుమల లోని 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు దర్శన సమయం కనీసం 12 గంటలకు పైగా పట్టే ఛాన్స్ ఉందని టీటీడీ వెల్లడించింది.
Also Read : Tirumala Rush : తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం