Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.24 కోట్లు
దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,336
Tirumala Hundi : తిరుమల శ్రీవారిని 66 వేల 336 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి 25 వేల 857 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిత్యం భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలకు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 2.24 కోట్లు సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.
Tirumala Hundi Updates
సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పించినట్లు టీటీడీ(TTD) పాలక మండలి చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతే కాకుండా భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్ల ద్వారా కాలి నడకన వచ్చే భక్త బాంధవులకు భారీ భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు గాను ప్రతి ఒక్క భక్తుడికి చేతి కర్రను ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఇటీవల చిరుతల సంచారం ఎక్కువగా ఉండడం, చిన్నారిని పొట్టన పెట్టుకోవడంతో 100 మంది సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశామని తెలిపారు భూమన కరుణాకర్ రెడ్డి.
ఇక దర్శనం విషయానికి వస్తే ప్రస్తుతం తిరుమల లోని 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
Also Read : Kotha Manohar Reddy : కొత్త మనోహర్ రెడ్డిపై వేటు