Tirumala : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.40 కోట్లు
స్వామిని దర్శించుకున్న భక్తులు 54,523
Tirumala : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు భక్తులు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ ఆదేశాల మేరకు ఈవో ఏవీ ధర్మా రెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారి సేవలకులు, సిబ్బంది భక్తుల సేవలో నిమగ్నమయ్యారు.
Tirumala Hundi
తాజాగా తిరుమలకు వచ్చే భక్తులకు అందజేసే అన్న ప్రసాదం నాణ్యతగా లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు టీటీడీ(TTD) చైర్మన్. కావాలని దుష్ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు.
ఇక తిరుమల పుణ్య క్షేత్రానికి 54 వేల 523 మంది శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. 20 వేల 817 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకున్నారు. నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.40 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం డైరెక్టు లైన్ ఉందని, ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం భక్తులకు కనీసం 8 గంటలకు పైగా ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read : CPI Ramakrishna : జగన్ రేవంత్ ను చూసి నేర్చుకో