Tirumala Hundi : భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
రూ. 4.71 కోట్లు..66,233 మంది భక్తులు
Tirumala Hundi : తిరుమల – పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 66 వేల 233 మంది దర్శించుకున్నారు. శ్రీనివాసుడికి మొక్కులు తీర్చుకున్నారు. 36 వేల 486 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
నిత్యం శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీనివాసుడి హుండీ ఆదాయం భారీగా సమకూరింది. నిన్న ఒక్క రోజే ఏకంగా ర. 4.71 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.
Tirumala Hundi Updates
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు టీటీడీ(TTD) కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. ఇక శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్లు నడక మార్గం ద్వారా వచ్చే భక్తుల భద్రతకు సంబంధించి ఫోకస్ పెట్టామన్నారు.
భక్తుల రక్షణ కోసం చేతి కర్రలను అందజేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఈవో. ఇక స్వామి వారి దర్శనం కోసం ఆక్టోపస్ భవనం వరకు భక్తుల క్యూ లైన్ ఉందని తెలిపారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం స్వామి వారి దర్శనం 30 గంటలకు పైగా పడుతుందని స్పష్టం చేశారు.
Also Read : Jay Shah Praise : మహిళా జట్టుకు జే షా ప్రశంస