Tirumala Rush : పుణ్య క్షేత్రం పోటెత్తిన భక్త జనం
శ్రీవారిని దర్శించుకున్న 85,497 భక్తులు
Tirumala Rush : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది పుణ్య క్షేత్రమైన తిరుమల. శ్రీనివాసుడు కొలువై ఉన్న ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోందే తప్పా ఎక్కడా తగ్గడం లేదు. కరోనా తర్వాత గణనీయంగా భక్తుల సంఖ్య పెరిగింది. సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చర్యలు చేపట్టింది.
Tirumala Rush with Devotees
టీటీడీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డి సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఏర్పాట్లపై టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
భక్తులు తమకు కల్పిస్తున్న ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీవారిని 85 వేల 497 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 873 మంది తలనీలాలు సమర్పించారు. నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.41 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) వెల్లడించింది.
శ్రీవారి దర్శనం కోసం తిరుమల లోని 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు దర్శన సమయం 8 గంటలకు పైగా పడుతుందని టీటీడీ స్పష్టం చేసింది.
Also Read : BJP Jana Sena Comment : పొత్తు పొద్దు పొడిచేనా ఓట్లు రాలేనా