Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.21 కోట్లు
శ్రీనివాసుడిని దర్శించుకున్న భక్తులు 68,601
Tirumala Rush : ఓ వైపు వర్షాలు కురుస్తున్నా మరో వైపు భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. గత 70 రోజుల నుంచి భక్తుల ఉధృతి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతి రోజూ 75 వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా నిన్న ఒక్క రోజు సోమవారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 68 వేల 601 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి 23 వేల 396 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
Tirumala Rush Huge
ఇక నిత్యం శ్రీనివాసుడు, శ్రీ అలివేలు మంగమ్మలకు సంబంధించిన హుండీ ఆదాయం గణనీయంగా పెరగడం విశేషం. రూ. 5.21 కోట్లు హుండీ ఆదాయం లభించిందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. ఇదిలా ఉండగా స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీస సమయం 10 గంటలకు పైగా పట్టే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది.
మరో వైపు టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా స్వామి వారికి సంబంధించి బ్రహ్మోత్సవాలను ఒకే సారి నిర్వహించే వారు. కానీ ఈసారి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తొలి విడత ఉత్సవాలకు సీఎం జగన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు ఈవో.
Also Read : Nara Lokesh : నారా లోకేష్ కు తప్పిన ప్రమాదం