Tirumala Rush : పుణ్య క్షేత్రం పోటెత్తిన భక్తజనం
దర్శించుకున్న భక్తులు 79,693
Tirumala Rush : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల పుణ్యక్షేత్రం వినుతి కెక్కింది. భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ప్రతి ఏటా నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ నెల 15న అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ ఉత్సవాలు అక్టోబర్ 23 వరకు జరిగాయి. తండోప తండాలుగా తరలి వచ్చారు తిరుమలకు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంలో సక్సెస్ అయ్యింది.
Tirumala Rush with Devotees
భక్తులకు అందుతున్న వసతి సౌకర్యాలను స్వయంగా టీటీడీ(TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. మరో వైపు దిగు తిరుపతి నుండి తిరుమలకు నడక దారి నుండి వచ్చే భక్తులకు సంబంధించి చేతి కర్రలను అందజేస్తోంది.
స్వామి వారి దర్శనానికి సంబంధించి శ్రీనివాసుడు, శ్రీ అలివేలు మంగమ్మలను 79 వేల 693 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 864 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు నిత్యం స్వామి వారికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.38 కోట్లు వచ్చినట్లు టీడీడీ వెల్లడలించింది.
తిరుమల లోని 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపింది.
Also Read : Bishan Singh Bedi : క్రికెట్ దిగ్గజం ఇక లేరు
