Tirumala Rush : పోటెత్తిన భ‌క్త‌జ‌నం భారీగా ఆదాయం

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న 71,472 మంది భ‌క్తులు

Tirumala Rush : క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ కొలువై ఉన్న ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం తిరుమ‌లకు భ‌క్తులు పోటెత్తారు. నిత్యం భ‌క్తుల ర‌ద్దీతో కిట కిట లాడుతోంది. ఎక్క‌డ చూసినా భ‌క్తులే అగుపిస్తున్నారు. గోవిందా గోవిందా , ఆప‌ద మొక్కుల వాడా గోవిందా, అనాధ ర‌క్ష‌క గోవిందా అంటూ శ్రీ‌వారి నామ స్మ‌ర‌ణ చేస్తున్నారు.

ఓ వైపు వేస‌వి సెల‌వులు ముగిశాయి. అయినా ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు భ‌క్తులు. పెద్ద ఎత్తున తిరుమ‌ల‌కు క్యూ క‌డుతున్నారు. శుక్ర‌వారం ఒక్క రోజే శ్రీ‌వారిని 71 వేల 472 మంది భ‌క్తులు ద‌ర్శించు కోవ‌డం విశేషం. గురువారం భ‌క్తుల ర‌ద్దీ త‌గ్గినా ఆ త‌ర్వాత మ‌రింత పెరిగారు. స్వామి వారికి 31 వేల 980 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు.

భ‌క్తుల తాకిడితో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి పెద్ద ఎత్తున కానుక‌లు, విరాళాలు స‌మ‌ర్పించారు. శ్రీ‌వారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. రూ. 3 కోట్ల 77 ల‌క్ష‌ల ఆదాయం స‌మ‌కూరింద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా స్వామి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు తిరుమ‌ల‌లోని 23 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 18 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని టీటీడీ అంచ‌నా వేసింది.

Also Read : Vakati Karuna : గుప్తా నిర్వాకం క‌రుణ‌కు అంద‌లం

Leave A Reply

Your Email Id will not be published!