Tirumala Rush : తిరుమల – ప్రపంచంలో అత్యధిక ఆదాయంతో పాటు భారీ ఎత్తున భక్తులు దర్శించుకుంటున్న ఏకైక పుణ్య క్షేత్రం తిరుమల. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్పా తగ్గడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి తండోప తండాలుగా తరలి వస్తున్నారు తిరుమల పవిత్ర క్షేత్రానికి.
Tirumala Rush with Devotees
నిన్న తిరుమలకు భక్తులు పోటెత్తారు. మొన్న కొద్దిగా తగ్గినప్పటికీ శుక్రవారం భక్తుల సంఖ్య పెరిగింది. శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 72 వేల 650 మంది భక్తులు దర్శించుకున్నారు. నిత్యం స్వామి వారికి సమర్పించుకునే తలనీలాలు 27 వేల 410 మంది సమర్పించుకున్నారు.
భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3. 33 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. భక్తుల సంఖ్య పెరగడంతో తిరుమల లోని 31 అపార్ట్ మెంట్లు నిండి పోయాయి.
ఎలాంటి టోకెన్లు లేకుండా వేచి ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం కావాలంటే 30 గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోందని పేర్కొంది టీటీడీ.
ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి.
Also Read : Nara Lokesh : ఢిల్లీలో నారా లోకేష్ బిజీ