Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు
దర్శించుకున్న భక్తులు 65,361
Tirumala Rush : తిరుమల – భక్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్త జన సందోహంతో కిట కిట లాడుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఉచితంగా అవకాశం కల్పించడంతో పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ).
Tirumala Rush with Devotees
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 65 వేల 361 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ(TTD) వెల్లడించింది. ఇదే సమయంలో స్వామి వారికి 20 784 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.91 కోట్లు వచ్చినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఇప్పటికే 8 లక్షలకు పైగా టోకెన్లు ఇచ్చినట్లు వెల్లడించారు.
భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్న ప్రసాదం, టీ, కాఫీ, మజ్జిగ అందజేస్తున్నట్లు తెలిపారు చైర్మన్, ఈవో.
Also Read : YV Subba Reddy : త్వరలోనే విశాఖ నుంచి పాలన