Tirumala : తిరుమల – పుణ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. రోజు రోజుకు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఎక్కడ చూసినా శ్రీవారి నామ స్మరణే. గోవిందా గోవిందా , ఆపద మొక్కుల వాడా గోవిందా, అనాధ రక్షక గోవిందా , అదివో అల్లదివో శ్రీహరి వాసము , పది వేల శేషుల పడగల మయం అంటూ స్మరిస్తున్నారు.
Tirumala Rush With Devotees
శ్రీనివాసుడి జపం చేస్తున్నారు. మంగళవారం సైతం భక్తులు పోటెత్తారు దర్శనం కోసం. 71 వేల 946 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీనివాసుడికి 30 వేల 294 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఏకంగా రూ. 4.51 కోట్ల ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
ఇదిలా ఉండగా తిరుమల లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కలిగేందుకు కనీసం 18 గంటలకు పైగా పడుతుందని టీటీడీ తెలిపింది.
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి శ్రమ కోర్చి స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు కల్పించడం జరిగిందని స్పష్టం చేశారు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి.
Also Read : JD Lakshminarayana : ఆంగ్లంపై మోజు తెలుగుకు బూజు