Tirumala : సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లు

విస్తృతంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ

Tirumala : తిరుమ‌ల – శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఏర్పాట్లు చేసింది. సెప్టెంబ‌ర్ 18 సోమ‌వారం నుండి ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ఉత్స‌వాలు సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు కొన‌సాగనున్నాయి.

ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నిన్న శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ చేప‌ట్టారు. ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

Tirumala Brahmotsavam Viral

వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.

ఇదిలా ఉండ‌గా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు టీటీడీ(TTD) ఈవో ధ‌ర్మారెడ్డి వెల్ల‌డించారు. నూత‌నంగా ర‌హ‌దారులతో పాటు భ‌క్తుల సౌక‌ర్యం కోసం విద్యుత్ బ‌స్సుల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు.

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ విశిష్ట కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్‌ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జె ఇ ఓ వీరబ్రహ్మం పాల్గొన్నారు.

Also Read : Shashi Tharoor : పోటెత్తిన జ‌నం థ‌రూర్ ఆశ్చ‌ర్యం

Leave A Reply

Your Email Id will not be published!