JP Nadda : టీఎంసీ అంటే టెర్ర‌ర్..మాఫియా..క‌రప్ష‌న్

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా

JP Nadda : భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా నిప్పులు చెరిగారు. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని టార్గెట్ చేశారు. టీఎంసీ అంటే టెర్ర‌ర్ (ఉగ్ర‌వాదం) , మాఫియా, క‌రప్ష‌న్ (అవినీతి) అని కొత్త అర్థం చెప్పారు. రాష్ట్రంలో మ‌హిళా సీఎం ఉన్నా మ‌హిళ‌ల‌పై నేరాల ప‌రంగా చార్టులో అగ్ర‌స్థానంలో ఉంద‌న్నారు జేపీ న‌డ్డా(JP Nadda). పీఎం ఆవాస్ యోజ‌న (పీఎంఏవై) అమ‌లులో భారీ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డింద‌ని ఆరోపించారు. ఆదివారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ప‌శ్చిమ బెంగాల్ లో ఎక్క‌డ చూసినా అవినీతి చోటు చేసుకుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. టీఎంసీ పాల‌నలో రాష్ట్రం స్తంభించి పోయింది. రాబోయే రోజుల్లో టీఎంసీ అంతం కావ‌డం ఖాయ‌మ‌న్నారు జేపీ న‌డ్డా. ఇటీవ‌ల కేంద్ర స‌ర్కార్ పీఎంఏఐ స్కీం అమలుపై ప‌శ్చిమ బెంగాల్ లో విచార‌ణ చేప‌ట్టింద‌ని చెప్పారు. ఇందులో దిగ్భ్రాంతిక‌ర‌మైన వాస్త‌వాలు వెలుగు చూశాయ‌ని చెప్పారు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు.

ఈ విచార‌ణలో విచిత్రం ఏమిటంటే పేద‌ల‌కు కాకుండా భారీ భ‌వంతులు క‌లిగిన వారికి ఇళ్లు ల‌భించిన‌ట్లు తేలింద‌న్నారు. ప‌శ్చిమ బెంగాల్ లో ఇదీ ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. రాష్ట్రంలోని ప్ర‌తి రంగంలో అవినీతి పేరుకు పోయింద‌ని చెప్పారు. ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ అయినా లేదా మ‌రేదైనా ప్ర‌తిదీ క‌ర‌ప్ష‌న్ తో అంటి పెట్టుకుని ఉంద‌న్నారు.

ఎంత సేపు కేంద్ర స‌ర్కార్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌ప్ప రాష్ట్రంలో ఏం చేస్తున్నార‌నేది సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ చెప్ప‌డం లేద‌ని ఆరోపించారు.

Also Read : ప్ర‌జా సంక్షేమం మోదీ ప్ర‌చారం

Leave A Reply

Your Email Id will not be published!