TMC Meghalaya : మేఘాలయలో టీఎంసీ కింగ్ మేకర్
ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ
TMC Meghalaya Result : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పినట్లు గానే మేఘాలయలో సత్తా చాటింది. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. ప్రస్తుతం పవర్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ప్రభుత్వానికి ఆశించిన మేర మెజారిటీ రాలేదు. తాజాగా ఎన్నికల ఫలితాలు(TMC Meghalaya Result) వెలువడ్డాయి. మేఘాలయ లో మొత్తం 60 సీట్లు ఉండగా యూడీపీకి చెందిన అభ్యర్థి మరణించడంతో ఎన్నికల సంఘం అక్కడ ఎన్నిక వాయిదా వేసింది.
దీంతో మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించింది. ఇవాళ మేఘాలయతో పాటు త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. త్రిపురలో బీజేపీలో స్పష్టమైన మెజారిటీతో దూసుకు పోగా నాగాలాండ్ లో కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మేఘాలయలో ప్రస్తుతం ఎన్పీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ బరిలో నిలిచాయి. ముకుల్ సంగ్మా తో పాటు కాంగ్రెస్ కు చెందిన ప్రముఖులు టీఎంసీతో కలిసి ఎన్పీపీకి పోటీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.
మేఘాలయలో 2018లో టీఎంసీ బోణీ కొట్టలేదు. కానీ 2023లో మాత్రం ఎన్పీపీకి ప్రధాన సవాల్ గా నిలిచింది. మేఘాలయ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు సీఎం మమతా బెనర్జీ(TMC Meghalaya Result). ఓటు వేసిన వారికీ వేయని వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తమపై నమ్మకం ఉంచిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు సీఎం.
మరో వైపు పవర్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ గతంలో వచ్చిన వాటి కంటే తక్కువ సీట్లను కైవసం చేసుకుంది. ఇప్పుడు టీఎంసీ మద్దతు తప్పనిసరి.
Also Read : అమిత్ షాతో భగవంత్ మాన్ భేటీ