Abhishek Banerjee : స్వలింగ వివాహాలకు బెనర్జీ సపోర్ట్
ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది
Abhishek Banerjee : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్వలింగ సంపర్క వివాహాలకు సంబంధించిన చట్ట బద్దత గురించి చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా లెస్బియన్, గే మ్యారేజెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు ఎంపీ. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఎవరు ఎవరిని చేసుకోవాలో, ఎవరు ఎవరితో సహ జీవనం చేయాలో ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని స్పష్టం చేశారు అభిషేక్ బెనర్జీ. భారత దేశం ప్రజాస్వామ్య దేశమని ప్రతి ఒక్కరికీ జీవిత భాగస్వామిని ఎంచుకునే వీలు తప్పక ఉంటుందన్నారు. ప్రేమకు మతం, సరిహద్దులు, కులం అన్నది ఉండదన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొన్నారు ఎంపీ.
ఎవరు ఎవరితో ఉండాలనేది ఎవరూ నిర్ణయించ లేమన్నారు. అది పరస్పర అవగాహన మీద ఆధారపడి ఉంటుందన్నారు. పురుషుడు ఇంకో పురుషుడితో ప్రేమలో పడడం, ఒక స్త్రీ ఇంకో స్త్రీతో బంధం కలిగి ఉండాలని అనుకోవడం చట్ట విరుద్దమని ఎలా అనగలమని ప్రశ్నించారు. ఎవరి మానాన వారిని వదిలి వేస్తే ఇన్ని సమస్యలు రావన్నారు అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee).
Also Read : ‘లింగాయత్’ లు ఎటు వైపు