Revanth Reddy : జనవరి 26 నుంచి ‘ప్రజా యాత్ర’ – రేవంత్
హాత్ సే హాత్ పేరుతో జనంలోకి
Revanth Reddy : ఓ వైపు సీనియర్ల ఆగ్రహం మరో వైపు కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేతల గుస్సా మధ్య కాంగ్రెస్ పార్టీ కీలక మీటింగ్ పై ఉత్కంఠకు తెర దించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారం గాంధీ భవన్ లో జరిగిన మీటింగ్ కు జానా రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీలు , ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది టీపీసీసీ. ఏఐసీసీ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో పేరుతో పాదయాత్ర సాగనుందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు. ఈ మేరకు యాత్రకు సంబంధించిన కీలన విషయాలు ప్రకటించారు. పార్టీ బలోపేతం చేయడం, ప్రజల్లోకి వెళ్లడం, వారి సమస్యలను తెలుసు కోవడంపై సమావేశం నిర్వహించింది.
హైకమాండ్ రెండు నెలల పాటు యాత్ర చేపట్టాలని ఆదేశించిందని చెప్పారు రేవంత్ రెడ్డి. పాదయాత్రలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. టీపీసీసీ చీఫ్ హోదాలో తాను పాదయాత్రను చేపడతానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. మరో వైపు అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది.
ఇప్పటికే దేశానికి చెందిన ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు. మాజీ ఆర్బీఐ గవర్నర్ , సినీ ప్రముఖులు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. ఇదే సమయంలో దిగ్గజ నటుడు కమల్ హాసన్ కూడా పాల్గొంటారని సమాచారం.
మరో వైపు సీనియర్ల డుమ్మా కలకలం రేపింది.
Also Read : పదవులకు వలస నేతలు గుడ్ బై