Tranfer of IAS officers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు ! 63 మంది ఐఏఎస్ లకు స్థాన చలనం !

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు ! 63 మంది ఐఏఎస్ లకు స్థాన చలనం !

Tranfer of IAS officers: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులిచ్చింది. వీరిలో ఇప్పటికే బదిలీ అయ్యి పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న అధికారులు కొందరు ఉండగా, ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ అయిన వారు అధికంగా ఉన్నారు. మొత్తంగా ఒకేసారి 63 మందికి స్థానచలనం కలిగింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికీ తాజాగా కీలక పోస్టింగులు దక్కడం గమనార్హం.

Tranfer of IAS officers in AP..

ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే విడతల వారీగా సీనియర్‌ ఐఏఎస్‌ల బదిలీలు(Tranfer of IAS officers) చేపట్టింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్ల నియామకాలను దాదాపుగా పూర్తిచేసింది. తాజాగా శనివారం సాయంత్రం పెద్దఎత్తున మార్పులు చేసింది. కార్యదర్శి, డైరెక్టర్‌ సహా సంయుక్త కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు తదితర స్థానాల్లో నియమించింది. తాజా ఉత్తర్వులతో అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీలు కూడా పూర్తయినట్టే కనిపిస్తోంది.

కేరళ నుంచి ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చిన 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌(IAS) అధికారి వీఆర్‌ కృష్ణతేజ మైలవరపు… పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కార్మిక శాఖ కమిషనర్‌గా ఉన్న ఎంవీ శేషగిరిబాబును స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న ఐఆర్‌ఎస్‌ అధికారి వి.రామకృష్ణను అక్కడి నుంచి తప్పించింది. కార్మిక శాఖ కమిషనర్‌ పోస్టును ఎవరికీ ఇవ్వలేదు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేసిన చేవూరు హరికిరణ్‌ కు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు జాతీయ ఆరోగ్య మిషన్‌ ఎండీగా అదనపు బాధ్యతల్లోనూ ఆయన కొనసాగుతారు.

పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్‌ సెర్ప్‌ సీఈవోగా నియమితులయ్యారు. గృహనిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న పీఎస్‌ గిరీషాను పౌరసరఫరాల సంస్థ ఎండీగా బదిలీ చేసింది. చేనేత, జౌళి శాఖ కమిషనర్‌గా రేఖారాణి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్‌ శ్రీధర్‌ను నియమించింది. ఇటీవలి వరకు విశాఖపట్నం కలెక్టర్‌గా పనిచేసిన మల్లికార్జునను బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమిస్తూ, వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ వీసీ, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన హరినారాయణన్‌ను పురపాలక శాఖ డైరెక్టర్‌గా నియమించింది. శ్రీకాకుళం, పల్నాడు జిల్లాల కలెక్టర్‌ గా పనిచేసిన లఠ్కర్‌ శ్రీకేశ్‌ బాలాజీరావు సర్వే సెటిల్‌మెంట్, భూదస్త్రాల శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బదిలీ అయిన వారిలో ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు కొందరున్నారు. వారికి పోస్టింగులు ఇవ్వలేదు.

Also Read : Heavy Rains: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, నదులు..

Leave A Reply

Your Email Id will not be published!