Nityananda Cities : యుఎస్ నగరాలతో కైలాస ఒప్పందం
సాంస్కృతిక భాగస్వామ్యంకి పెద్ద పీట
Nityananda Cities : వివాదాస్పద గురు నిత్యానంద స్థాపించిన కైలాస దేశం అమెరికా లోని 30 నగరాలతో సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజమని ఇంకా తెలియ రాలేదు. నెవార్క్ , యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస మధ్య సోదర నగర ఒప్పదం ఈ ఏడాది జనవరి 12న జరిగింది.
ఇందుకు సంబంధించి మొత్తం అమెరికా లోని 30 నగరాలను కలిగి ఉండడం విశేషం. ఈ కార్యక్రమం నెవార్క్ లని సిటీ హాల్ లో చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా నిత్యానంద పై అత్యాచారం , లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత దేశం ఇప్పటికే వెతుకుతోంది.
కానీ కళ్లు కప్పి దేశం దాటి వెళ్లి పోయాడు. ఏదో ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత స్వంతంగా దేశాన్ని ప్రకటించాడు. దానికి తానే పేరు పెట్టాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసా అని. ఇదిలా ఉండగా అమెరికా నగరాలతో(Nityananda Cities) సాంస్కృతిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు యుఎస్ మీడియా వెల్లడించింది.
అమెరికా లోని న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ నగరం వెల్లడించింది. అయితే కల్పిత దేశంతో సిస్టర్ సిటీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 2019లో దేశాన్ని స్థాపించినట్లు ప్రకటించాడు. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశానికి సంబంధించిన రాయబారి ఐక్య రాజ్య సమితి హక్కుల సంస్థ నిర్వహించిన మీటింగ్ లో పాల్గొనడం కలకలం రేపింది.
ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో భారత దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది. తాము నిత్యానంద కోసం వెతుకుతున్నామని మీరు ఎలా దానిని గుర్తిస్తారంటూ ప్రశ్నించింది. ఈ తరుణంలో అమెరికా నగరాలతో ఒప్పందం(Nityananda Cities) అనేది మరోసారి చర్చకు దారితీసింది.
Also Read : టెమ్‌జెన్ ఇమ్నా వైరల్