Tribals: పోలీసులపై పోడు రైతుల రాళ్ల దాడి

పోలీసులపై పోడు రైతుల రాళ్ల దాడి

Tribals: అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి వెళ్ళిన అటవీ అధికారులు, పోలీసులపై.. ముల్తానీలు(పోడు రైతులు) రాళ్ల దాడి చేశారు. తమ భూముల్లో మొక్కలు నాటొద్దంటూ అడ్డుకున్నారు. దీనితో ఆదిలాబాద్‌ జిల్లా (Adilabad) ఇచ్చోడ మండలం సిరిచెల్మ అటవీ పరిధిలోని కేశవపట్నం గ్రామంలో గత రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం జరిగిన దాడిలో ఇచ్చోడ ఎస్‌ఐ సహా 8 మంది పోలీసులకు గాయాలయ్యావగా… వారి వాహనం ధ్వంసం అయ్యింది. వెంటనే వారిని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

Tribals Attack on Police

కాగా, ప్రతీ ఏటా ఈ అటవీ ప్రాంతంలో అధికారులు మొక్కలు నాటుతుంటారు. అందులో భాగంగానే శనివారం సిరిచెల్మ అటవీ పరిధిలోని 172, 174 కంపార్ట్‌మెంట్లలో మొక్కలు నాటేందుకు అధికారులు.. వారి భద్రత కోసం పోలీసులు వెళ్లారు. అక్కడి భూములు సాగు చేస్తున్న ముల్తానీలు… నాటిన మొక్కలను పీకేసి ఆ భూములు తమవేనని, తమ భూముల్లో మొక్కలు నాటవద్దని అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ జోలికి వస్తే ఇక్కడే కొడవళ్లతో ఆత్మహత్యలు చేసుకుంటామని… అక్కడున్న మహిళా రైతులు బెదిరించడంతో అధికారులు వెళ్లిపోయారు. తిరిగి ఆదివారం ఉదయం అధికారులు, పోలీసులు పకడ్బందీగా గ్రామానికి వెళ్లగా.. గ్రామస్థులంతా ఏకమై పోలీసులపై దాడి చేశారు. దీంతో కేశవపట్నంలో భారీగా పోలీసులను మోహరించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఇచ్చోడ పోలీసు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ… పోడు భూముల సమస్యపై అటవీ అధికారులతో చర్చలను కొనసాగించారు.

Also Read : Shashi Tharoor: కాంగ్రెస్ నేత శశిథరూర్‌ పై స్వంత పార్టీ నేతల అసంతృప్తి

Leave A Reply

Your Email Id will not be published!