Subhash Chandra Bose : వీరుడికి సలాం నేతాజీకి లాల్ సలాం
దేశం గర్వించదగిన సమర యోధుడు
Subhash Chandra Bose : భారత విప్లవ యోధుడు , స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వర్దంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. 1897 జనవరిలో కటక్ లో పుట్టారు.
స్వతంత్ర ఉద్యమంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారు. ఆజాద్ హిందూ ఫౌజ్ ను ఏర్పాటు చేశారు. ఆనాటి పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు.
స్వతంత్ర పోరాటంలో నేతాజీ ఇచ్చిన నినాదం సంచలనం రేపింది. కోట్లాది మంది భారతీయులను ఉత్తేజితులను చేసింది. నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానని ప్రకటించారు.
ఆనాటి నినాదం ఇప్పటికీ ఎంతో మంది నాయకులు, యువతీ యువకులు ప్రస్తావిస్తూ ఉంటారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 77వ వర్ధంతి ఇవాళ. ఈ సందర్బంగా పలువురు రాజకీయ నాయకులు గురువారం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
భారత దేశంలో గొప్ప స్వాతంత్ర సమర యోధులలో ఒకరైన సుభాష్ చంద్ర బోస్(Subhash Chandra Bose) కు వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. తన అధికారిక ట్విట్టర్ లో వెల్లడించింది.
నేతాజీగా ప్రసిద్ది చెందిన ఆయన దేశభక్తి , అతడి తర్వాత తరాలకు స్పూర్తినిచ్చిందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సుభాష్ కు తిరుగులేని కీర్తిని సంపాదించి పెట్టిందని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఈ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ కూడా సుభాష్ చంద్రబోస్ వర్దంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ట్వీట్ చేసింది. జార్ఖండ్ ప్రతిపక్ష నాయకుడడు ఇండియా గేట్ వద్ద బోస్ విగ్రహానికి నివాళులు అర్పించారు. గొప్ప దేశ భక్తుడు అంటూ బాబూలాల్ మరాండి పేర్కొన్నారు.
Also Read : సామాన్యులు సమర యోధులు
