Bheemla Nayak Success : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు ఈ చిత్రాన్ని.
మనోడు ప్రేక్షకులపై నోరు పారేసుకున్నాడు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం భీమ్లా నాయక్ సక్సెస్(Bheemla Nayak Success) తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇక దర్శకుడు సాగర్ కె చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పు కోవాలి.
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండకు చెందిన సాగర్ కు అనుకోని రీతిలో పవన్ కళ్యాన్ తన సినిమాకు పని చేసే ఛాన్స్ ఇచ్చాడు. మలయాళంలో వచ్చిన బంపర్ హిట్ మూవీకి మాతృక భీమ్లా నాయక్.
అనుకోని దాని కంటే భారీ రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీకి. కథ , దర్శకత్వం సాగర్ చంద్ర చేస్తే. స్క్రీన్ ప్లే, స్కిప్ట్ సహకారం అందించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ చేశాడు.
అందులో బుట్ట బొమ్మ పూజా హెగ్డే కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఒకటి అతడు కాగా రెండోది ఖలేజా. తెలుగు సినీ ఇండస్ట్రీలో అతడు ఓ సెన్షేషన్.
ఇక భీమ్లా నాయక్ భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ పెట్టింది. ఇందులో దర్శకుడు సాగర్ కె చంద్ర మాట్లాడారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లేక పోతే ఈ సినిమా లేదన్నాడు.
అంతే కాకుండా ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసిందన్నాడు. మొత్తంగా సినిమా పవర్ స్టార్ స్టామినా ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశానని చెప్పాడు.
Also Read : మనసు దోచేస్తున్న రాధే శ్యాం సాంగ్